భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ
ABN , Publish Date - Feb 01 , 2026 | 03:13 PM
భారత అభిమానులకు గుడ్ న్యూస్. సర్జరీ కారణంగా టీ20 జట్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. తాజాగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో మ్యాచ్ ఫిట్‌నెస్ టెస్ట్ పాసయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. దీని ముందు భారత్ అభిమానులకు గుడ్ న్యూస్. సర్జరీ కారణంగా టీ20 జట్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. తాజాగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో మ్యాచ్ ఫిట్‌నెస్ టెస్ట్ పాసయ్యాడు. కాగా సర్జరీ కారణంగా తిలక్.. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే.
బీసీసీఐ(BCCI) నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో తిలక్ వర్మ(Tilak Varma) ఉత్తీర్ణత సాధించాడని వైద్య బృందం క్లియరెన్స్ ఇచ్చింది. అతడు మంగళవారం(ఫిబ్రవరి 3) ముంబైలో టీమిండియా(Team India)తో కలవనున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు భారత్ ఆడనున్న రెండు వార్మప్ మ్యాచుల్లో తిలక్ భాగం కానున్నాడు. మరోవైపు న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన సంజు శాంసన్ స్థానంలో ఇషాన్ కిషన్(Ishan Kishan) ఆడటం లాంఛనమే. తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి టీ20లో ఇషాన్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ కప్ జట్టులో ఇషాన్ స్థానం ఖాయమైనట్టే. కాగా తిలక్ వర్మ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచ కప్ 2026 జరగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న ముంబై వేదికగా యూఎస్ఏతో తలపడనుంది. దానికి ముందు ఫిబ్రవరి 2న అమెరికా, ఫిబ్రవరి 4న సౌతాఫ్రికా జట్లతో టీమిండియా వార్మప్ మ్యాచులు ఆడనుంది.
ఇవి కూడా చదవండి..
పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. కుర్రాళ్లతో సచిన్, లక్ష్మణ్ చిట్‌చాట్..
మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్