Share News

ఇషాన్‌ తుఫాన్‌

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:36 AM

టీ20 వరల్డ్‌క్‌పనకు ముందు టీమిండియా అదిరే ప్రదర్శనతో ఆకట్టుకుంది. మెగా టోర్నీలో ప్రత్యర్థులారా.. ఇక కాచుకోండి అన్నట్టుగా జట్టులోని పవర్‌ హిట్టర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇషాన్‌ కిషన్‌ (43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 103) తన టీ20 కెరీర్‌లో...

ఇషాన్‌ తుఫాన్‌

4-1తో సిరీస్‌ కైవసం

42 బంతుల్లో శతకం

చెలరేగిన సూర్య, హార్దిక్‌

అర్ష్‌దీప్‌ పాంచ్‌ పటాకా

ఆఖరి టీ20లో కివీస్‌పై భారత్‌ విజయం

తిరువనంతపురం: టీ20 వరల్డ్‌క్‌పనకు ముందు టీమిండియా అదిరే ప్రదర్శనతో ఆకట్టుకుంది. మెగా టోర్నీలో ప్రత్యర్థులారా.. ఇక కాచుకోండి అన్నట్టుగా జట్టులోని పవర్‌ హిట్టర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇషాన్‌ కిషన్‌ (43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 103) తన టీ20 కెరీర్‌లో తొలి శతకంతో జట్టులో స్థానాన్ని ఖాయం చేసుకోగా.. అటు కెప్టెన్‌ సూర్యకుమార్‌ (30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 63) ఫామ్‌ను కొనసాగించాడు. దీంతో శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్‌ 46 పరుగుల తేడాతో నెగ్గింది. 4-1తో సిరీ్‌సను ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా (17 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 42), అభిషేక్‌ శర్మ (16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 30) చెలరేగారు. ఫెర్గూసన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో కివీస్‌ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ఫిన్‌ ఆలెన్‌ (38 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 80), రచిన్‌ రవీంద్ర (17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30), ఇష్‌ సోధీ (15 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 33) మాత్రమే రాణించారు. అర్ష్‌దీ్‌పనకు 5, అక్షర్‌కు 3 వికెట్లు లభించాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఇషాన్‌.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా సూర్యకుమార్‌ నిలిచారు.


ఆలెన్‌ పోరాడినా..: 272 పరుగుల ఛేదనను ఓపెనర్‌ ఆలెన్‌ ధాటిగా ఆరంభించాడు. అతడు క్రీజులో ఉన్నంత సేపు కివీస్‌ పోటీలోనే ఉంది. తొలి ఓవర్‌లో 3 ఫోర్లు.. మూడో ఓవర్‌లో 23 రన్స్‌ అందించిన ఆలెన్‌ ధాటికి పవర్‌ప్లేలో కివీస్‌ 79/1 స్కోరుతో నిలిచింది. ఈ క్రమంలో 22 బంతుల్లోనే ఆలెన్‌ అర్థసెంచరీ కూడా పూర్తయింది. తొమ్మిదో ఓవర్‌లో ఆలెన్‌ను అక్షర్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు రచిన్‌తో కలిసి అందించిన 100 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రచిన్‌ కూడా వేగంగా ఆడడంతో కివీస్‌ పదో ఓవర్‌లో 131/2 స్కోరుతో భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. కానీ ఆ తర్వాత అక్షర్‌, అర్ష్‌దీ్‌పల ధాటికి వేగంగా వికెట్లను కోల్పోవడం జట్టును దెబ్బతీసింది. చివర్లో సోధీ జోరుగా ఆడి ఓటమి అంతరాన్ని తగ్గించాడు.

ఎదురుదాడే లక్ష్యంగా..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ ఆకాశమే హద్దుగా సాగింది. సొంత మైదానంలోనూ ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (6) పేలవ ఫామ్‌ కొనసాగినా.. మరో ఎండ్‌లో అభిషేక్‌, ఇషాన్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌ ధనాధన్‌ ఆటతో బౌలర్లను ఆడేసుకున్నారు. పవర్‌ప్లేలోనే ఓపెనర్లు వెనుదిరగడంతో ఇషాన్‌-సూర్య జోడీ కాస్త నెమ్మదించింది. కానీ డ్రింక్స్‌ విరామం తర్వాత ఇషాన్‌ ధాటికి ఆట స్వరూపమే మారిపోయింది. ఫెర్గూసన్‌ ఓవర్‌లో 4,6తో బ్యాట్‌కు పనిచెప్పిన అతను 12వ ఓవర్‌లో 4,4,4,6,4, 6తో 29 రన్స్‌ రాబట్టాడు. అటు 14వ ఓవర్‌లో సూర్య 4,6,6,6తో 23 రన్స్‌ అందించడంతో పాటు 26 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశా డు. అయితే సూర్య వికెట్‌ను శాంట్నర్‌ తీయడంతో మూడో వికెట్‌కు అత్యధికంగా 137 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. అయినా ఇషాన్‌ జోరు తగ్గలేదు. 2 వరుస సిక్సర్లతో 42 బంతుల్లోనే తొలి సెంచరీ పూర్తి చేశాడు. ఆ వెంటనే డఫీకి ఇషాన్‌ చిక్కగా.. డెత్‌ఓవర్లలో హార్దిక్‌ భారీ షాట్లతో విజృంభించాడు. ఆఖరి ఓవర్‌లో సిక్సర్‌ బాది హార్దిక్‌ వెనుదిరగగా, శివమ్‌ దూబే (7 నాటౌట్‌) మరో సిక్సర్‌తో భారత్‌కు 21 రన్స్‌ సమకూరాయి. అటు చివరి 10 ఓవర్లలో జట్టు 169 రన్స్‌ సాధించడం విశేషం.


స్కోరుబోర్డు

భారత్‌: అభిషేక్‌ (బి) ఫెర్గూసన్‌ 30, శాంసన్‌ (సి) జాకబ్స్‌ (బి) ఫెర్గూసన్‌ 6, ఇషాన్‌ (సి) ఫిలిప్స్‌ (బి) డఫీ 103, సూర్యకుమార్‌ (స్టంప్‌) సీఫర్ట్‌ (బి) శాంట్నర్‌ 63, హార్దిక్‌ (సి) జాకబ్స్‌ (బి) డఫీ 42, రింకూ (నాటౌట్‌) 8, దూబే (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 271/5. వికెట్ల పతనం: 1-31, 2-48, 3-185, 4-233, 5-261. బౌలింగ్‌: డఫీ 4-0-53-1, జేమిసన్‌ 4-0-59-1, ఫెర్గూసన్‌ 4-0-41-2, సోధీ 3-0-48-0, ఫిలిప్స్‌ 1-0-10-0, శాంట్నర్‌ 4-0-60-1.

న్యూజిలాండ్‌: సీఫర్ట్‌ (సి) హార్దిక్‌ (బి) అర్ష్‌దీప్‌ 5, ఆలెన్‌ (సి) రింకూ (బి) అక్షర్‌ 80, రచిన్‌ (సి) అక్షర్‌ (బి) అర్ష్‌దీప్‌ 30, ఫిలిప్స్‌ (సి) రింకూ (బి) అక్షర్‌ 7, మిచెల్‌ (బి) అర్ష్‌దీప్‌ 26, శాంట్నర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) అర్ష్‌దీప్‌ 0, జాకబ్స్‌ (బి) వరుణ్‌ 7, జేమిసన్‌ (బి) అర్ష్‌దీప్‌ 9, సోధీ (సి) అర్ష్‌దీప్‌ (బి) రింకూ 33, ఫెర్గూసన్‌ (బి) అక్షర్‌ 3, డఫీ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 19.4 ఓవర్లలో 225 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-17, 2-117, 3-131, 4-137, 5-137, 6-166, 7-179, 8-180, 9-191, 10-225. బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-51-5, హార్దిక్‌ 2-0-15-0, బుమ్రా 4-0-58-0, వరుణ్‌ 4-0-36-1, అక్షర్‌ 4-0-33-3, అభిషేక్‌ 1-0-13-0, రింకూ 0.4-0-7-1.

1

అంతర్జాతీయ టీ20ల్లో తక్కువ బంతుల్లో (1,822) మూడు వేల పరుగులు పూర్తి చేసిన

బ్యాటర్‌గా సూర్యకుమార్‌.

  • ద్వైపాక్షిక సిరీ్‌సలో ఎక్కువ సిక్సర్లు (69) బాదిన జట్టుగా భారత్‌.

  • న్యూజిలాండ్‌పై టీ20ల్లో అత్యధిక స్కోరు (271) చేసిన జట్టుగా భారత్‌.

  • అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ పరుగులిచ్చి (51) ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్‌.

ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్

టీ20 ప్రపంచ కప్ 2026: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు

Updated Date - Feb 01 , 2026 | 02:14 PM