టీ20 ప్రపంచ కప్ 2026: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు
ABN , Publish Date - Jan 31 , 2026 | 02:16 PM
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. దీంట్లో స్టార్ ప్లేయర్లు చోటు దక్కించుకోలేకపోయారు. పాట్ కమిన్స్, స్మిత్ జట్టుకు దూరం కాగా.. మిచ్ మార్ష్ ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఈ మెగా టోర్నీ(T20 World Cup 2026) .. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. తాజాగా దీనికి సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో కీలక ప్లేయర్లకు స్థానం దక్కలేదు. గాయం కారణంగా పాట్ కమిన్స్ దూరమయ్యాడు. అనూహ్యంగా స్టీవ్ స్మిత్‌కు జట్టులో చోటు దక్కలేదు.
గ్లెన్ మాక్స్‌వెల్, ఆడం జంపాకు స్థానం దక్కింది. కాగా మిచ్ మార్ష్ ఆసీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉండగా.. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఫిబ్రవరి 11న ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో ఆడనుంది.
ఆసీస్ జట్టు ఇదే:
మిచ్ మార్ష్(కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కానెల్లీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కెమెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమెన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూపీఎల్ 2026.. టాస్ ఓడిన ముంబై ఇండియన్స్
దాన్ని అద్భుతమైన ప్రదర్శన అనలేం.. పాక్ పీఎం ట్వీట్‌పై ఆకాశ్ చోప్రా రియాక్షన్