Home » Australia
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్ట్ ఆడుతున్నాయి. నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలుపుకి ఇంకా 228 పరుగులు కావాలి.
యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడుతున్నాయి. ఓవర్‌నైట్ 213/8 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 286 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది.
ఉగ్రవాది సాజిద్‌కు హైదరాబాద్‌తో లింకులేంటి.. అన్నదానిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా సాజిద్ సంబంధీకులను పోలీసులు విచారిస్తున్నారు. ఆయన తండ్రి, ఆయన సోదరుడు వైద్యుడుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటలో డిసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) వివాదం చోటుచేసుకుంది. దీనిపై ఐసీసీ స్పందించింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీకి సంబంధించిన డీఆర్ఎస్ విషయంలో సాంకేతిక లోపం జరిగిందని ఐసీసీ అంగీకరించింది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బోండీ బీచ్‌లోరెండు రోజుల క్రితం యూదుల హనుక్కా వేడుక లక్ష్యంగా ఇద్దరు దుండగలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడి.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికి వార్తల్లో నిలిచాడు. అతన్ని రూ.25.20 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ అతడు డకౌట్ అయ్యాడు.
ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉగ్రదాడిలో చనిపోయిన ఓ వ్యక్తి పెంపుడు కుక్కకు సంబంధించిన ఆ వీడియో నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తోంది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండి బీచ్‌లో ఆదివారం జరిపిన ఉగ్రదాడిలో 15 మంది మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న తండ్రీకొడుకుల్లో తండ్రి హైదరాబాద్‌కు చెందిన వాడు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
పోలీసు అధికారులు బోండి బీచ్‌లో మారణకాండకు పాల్పడ్డ ఆ దుర్మార్గులను తండ్రీ కొడుకులుగా గుర్తించారు. 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, 24 ఏళ్ల నవీద్ అక్రమ్‌లు ఈ దాడికి పాల్పడ్డారు. సాజిద్ పోలీసుల కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడు. ప్రస్తుతం దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సిడ్నీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాండి బీచ్ లో ఇద్దరు దుండగులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పదిమందికి పైగా మృతి చెందారు. ఈ కాల్పుల నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్ కీలక వ్యాఖ్యలు చేశారు.