Share News

టీ20 డబ్ల్యూసీ-2026 ఫైనల్‌‌కు చేరేది ఆ జట్లే.. ఆసీస్ మాజీ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:37 PM

టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. భారత్, పాకిస్థాన్ ఓకే గ్రూపులో ఉన్నాయి. ఈ క్రమంలో భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోతుందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్‌ క్లార్క్‌ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

టీ20 డబ్ల్యూసీ-2026 ఫైనల్‌‌కు చేరేది ఆ జట్లే.. ఆసీస్ మాజీ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
India vs Pakistan

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026) టోర్నీ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. ఈ సారి ఏ జట్టు టైటిల్ గెలుస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గ్రూప్‌-ఎ నుంచి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌, పాకిస్థాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ జట్లు పోటీపడుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్‌ - పాకిస్థాన్‌ ఈసారి కూడా ఒకే గ్రూపులో ఉండటం క్రికెట్‌ ప్రేమికులను ఆకర్షిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


శుక్రవారం మైకేల్ క్లార్క్(Michael Clarke) ఓ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2026కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 'భారత్, పాక్ మధ్య పోరు ఉత్కంఠగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే సుదీర్ఘకాలంగా టీమిండియా పాక్‌ను ఓడిస్తూనే ఉంది. భారత జట్టుకు పాక్‌ దరిదాపుల్లో కూడా లేదు. టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమిస్తేనే పాక్‌ సానుకూల ఫలితం రాబట్టగలదు. అయితే పాక్‌పై సూర్యకుమార్ సేన విజయం సాధిస్తుంది’ అని క్లార్క్‌ పేర్కొన్నాడు.


ఇదే సమయంలో టీ20 వరల్డ్‌కప్‌-2026 ఫైనల్‌కు చేరే జట్లపై కూడా మైకేల్‌ క్లార్క్‌ అంచనా వేశాడు. ప్రపంచ కప్‌నకు ఆతిథ్యం ఇస్తున్న భారత్ పాటు ఆస్ట్రేలియా(IND Vs AUS Match) టైటిల్‌ పోరుకు అర్హత సాధిస్తాయని జోస్యం చెప్పాడు. కాగా టీ20 ఫార్మాట్లో భారత్ ఇప్పటివరకు రెండు టైటిల్స్‌ను గెలిచింది. 2007లో మొదలైన ప్రపంచకప్‌ టోర్నీలో ధోని సారథ్యంలోని టీమిండియా మొదటి టైటిల్ గెలిచింది. చాలా ఏళ్ల తర్వాత 2024లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో మరోసారి పొట్టి ప్రపంచకప్‌ను భారత్‌ ముద్దాడింది. ఇక వన్డే వరల్డ్‌కప్‌ టోర్నమెంట్లలో ఆధిపత్యం కనబరిచే ఆస్ట్రేలియా టీ20 ఫార్మాట్లో మాత్రం ఇప్పటివరకు ఒకే ఒక్కసారి ట్రోఫీ గెలిచింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వన్డే కెప్టెన్‌గా తిరిగి రోహిత్‌ శర్మనే.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

కివీస్‌కు బిగ్ షాక్.. టీ20 వరల్డ్‌ కప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్

అభిషేక్ చేసిన పనికి ఫిదా అయిన గావస్కర్.. వీడియో వైరల్

Updated Date - Jan 23 , 2026 | 04:38 PM