Share News

వన్డే కెప్టెన్‌గా తిరిగి రోహిత్‌ శర్మనే.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 23 , 2026 | 01:24 PM

వన్డే కెప్టెన్‌గా తిరిగి రోహిత్‌ శర్మని నియమించాలంటూ బీసీసీఐకి భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విజ్ఞప్తి చేశాడు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ వరుస ఓటములు ఎదుర్కుంటోందని, వన్డే ప్రపంచకప్ కోసం సారథిని మార్చాలని కోరాడు.

వన్డే కెప్టెన్‌గా తిరిగి రోహిత్‌ శర్మనే.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
Rohit Sharma

స్పోర్ట్స్ డెస్క్: భారత వన్డే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శుభ్‌మన్ గిల్‌కు(Shubman Gill) వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. అతడి సారథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్ 2-1 తేడాతో ఓడింది. తాజాగా.. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలోనూ 2-1 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. భారత గడ్డపై కివీస్ వన్డే సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి. ఈ సిరీస్‌లో తమ ద్వితీయ శ్రేణి జట్టుతో ఆడిన కివీస్ జట్టు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలోనే గిల్ కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి(Manoj Tiwari) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుభ్‌మన్ గిల్‌ను తప్పించి.. వన్డే కెప్టెన్సీ తిరిగి రోహిత్ శర్మకు అప్పగించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.


తాజాగా.. ఓ మీడియా ఛానల్‌ సంభాషణలో తివారీ పలు విషయాలను వెల్లడించాడు. 'నేను కచ్చితంగా సూచిస్తున్నాను. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఇదేదో ద్వైపాక్షిక సిరీస్‌ గురించి నేను మాట్లాడటం లేదు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ టోర్నీ జరగనుంది. ఇలాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో ప్రయోగాలు అవసరం లేదు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో రోహిత్ కెప్టెన్‌గా(Rohit Sharma ODI Captain) ఉండి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, తొలిసారి సిరీస్‌ను కోల్పోయింది.


గిల్ కంటే రోహిత్ 'చాలా మెరుగ్గా' ఉన్నాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించాల్సిన అవసరం ఎమొచ్చింది? ఇప్పటికీ రోహిత్ వన్డేల్లో నాయకత్వం వహించి ఉంటే.. ఫలితం పూర్తిగా భిన్నంగా ఉండేది. గిల్‌ కంటే రోహిత్‌ ఎన్నోరెట్లు గొప్ప కెప్టెన్‌. అతడొక విజయవంతమైన సారథి. గిల్‌ కెప్టెన్సీలో భారత్ వరల్డ్‌కప్‌ గెలిచే అవకాశాలు ఉండవచ్చు. అయితే రోహిత్‌ కెప్టెన్‌గా ఉంటే జట్టు కచ్చితంగా విజేతగా నిలుస్తుంది' అని తివారి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కివీస్‌కు బిగ్ షాక్.. టీ20 వరల్డ్‌ కప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్

అభిషేక్ చేసిన పనికి ఫిదా అయిన గావస్కర్.. వీడియో వైరల్

Updated Date - Jan 23 , 2026 | 02:58 PM