Share News

IND Vs NZ: భారత తుదిజట్టులో కీలక మార్పు.. స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:42 AM

రాయ్‌పూర్‌ వేదికగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 జరగనుంది. సాయంత్రం 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆడటం అనుమానమే.

IND Vs NZ: భారత తుదిజట్టులో కీలక మార్పు.. స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!
Kuldeep Yadav

స్పోర్ట్స్ డెస్క్: నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఈ క్రమంలోనే మరో విజయంపై కన్నేసింది టీమిండియా. నేడు రాయ్‌పూర్‌ వేదికగా ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి.. సిరీస్ ఆధిక్యం పొందాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. సాయంత్రం 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీ20 వైస్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మ్యాచ్‌కు దూరం కానున్నట్టు సమాచారం.


అసలేం జరిగిందంటే..

కివీస్‌తో జరిగిన తొలి టీ20 సందర్భంగా అక్షర్‌ పటేల్‌(Axar Patel Injured)కు గాయమైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్లో అక్షర్ వేసిన బంతిని డారిల్‌ మిచెల్‌ స్ట్రెయిట్‌ డ్రైవ్‌ షాట్‌ ఆడాడు. ఆ బంతి అక్షర్ ఎడమచేతి చూపుడు వేలికి బలంగా తాకింది. దీంతో అతడి వేలు చిట్లి రక్త స్రావం కావడంతో.. మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో అతడు ఇవాళ జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో ఆడేది అనుమానమే. అయితే అక్షర్‌ పటేల్‌ గాయం తీవ్రతపై, ఈ మ్యాచ్‌‌లో ఆడే విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

ఈ నేపథ్యంలో భారత తుది జట్టులో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్షర్‌ తుదిజట్టులో అందుబాటులో లేకపోతే ఆ స్థానాన్ని కుల్దీప్‌ యాదవ్‌‌తో భర్తీ చేసే అవకాశముంది.


న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో కుల్దీప్‌ యాదవ్‌ అంతంత మాత్రంగానే రాణించినా.. టీ20లలో మాత్రం అతడికి మంచి అనుభవముంది. అందుకే ఈ చైనామన్ బౌలర్ వైపు యాజమాన్యం మొగ్గుచూపుతోంది. ఈ ఒక్క మార్పు మినహా టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి సన్నాహకంగా ఇరుజట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. నాగ్‌పూర్‌లో 48 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

రెండో టీ20 భారత్ తుది జట్టు(అంచనా):

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్ చక్రవర్తి


ఈ వార్తలు కూడా చదవండి..

కివీస్‌కు బిగ్ షాక్.. టీ20 వరల్డ్‌ కప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్

అభిషేక్ చేసిన పనికి ఫిదా అయిన గావస్కర్.. వీడియో వైరల్

Updated Date - Jan 23 , 2026 | 12:08 PM