Share News

గుజరాత్‌ గెలిచింది

ABN , Publish Date - Jan 23 , 2026 | 05:05 AM

మూడు వరుస పరాజయాలతో డీలా పడిన గుజరాత్‌ జెయింట్స్‌ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. బౌల ర్లు విజృంభించిన వేళ గురువారం జరిగిన మ్యాచ్‌లో 45 పరుగులతో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది...

గుజరాత్‌ గెలిచింది

  • సోఫీ ఆల్‌రౌండ్‌ షో

  • తిప్పేసిన రాజేశ్వరి

వడోదర: మూడు వరుస పరాజయాలతో డీలా పడిన గుజరాత్‌ జెయింట్స్‌ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. బౌల ర్లు విజృంభించిన వేళ గురువారం జరిగిన మ్యాచ్‌లో 45 పరుగులతో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది. తొలుత గుజరాత్‌ 20 ఓవర్లలో 153/8 స్కోరు చేసింది. సోఫీ డివైన్‌ (42 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీ చేయగా, బెత్‌ మూనీ (34 బంతుల్లో 5 ఫోర్లతో 38) రాణించింది. క్రాంతి గౌడ్‌, ఎకెల్‌ స్టోన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో యూపీ 17.3 ఓవర్లలో 108 పరుగులకు కుప్పకూలింది. లిచ్‌ఫీల్డ్‌ (27 బంతుల్లో 5 ఫోర్లతో 32), ట్రయన్‌ (22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 30 నాటౌట్‌) మినహా అంతా విఫలమయ్యారు. స్పిన్నర్‌ రాజేశ్వరీ గైక్వాడ్‌ (3/16) మూడు, రేణుకా సింగ్‌, సోఫీ డివైన్‌ చెరో రెండు వికెట్లు సాధించారు.

సంక్షిప్తస్కోర్లు: గుజరాత్‌: 20 ఓవర్లలో 153 /8 (సోఫీ డివైన్‌ నాటౌట్‌ 50, బెత్‌ మూనీ 38, డానీ వ్యాట్‌ 14, అనుష్క శర్మ 14, క్రాంతి గౌడ్‌ 2/18, ఎకెల్‌స్టోన్‌ 2/22) యూపీ: 17.3 ఓవర్లలో 108 ఆలౌట్‌ (లిచ్‌ఫీల్డ్‌ 32, ట్రయన్‌ నాటౌట్‌ 30, రాజేశ్వరి 3/16, సోఫీ డివైన్‌ 2/16, రేణుకా సింగ్‌ 2/20).

Updated Date - Jan 23 , 2026 | 05:05 AM