Share News

జోరు సాగనీ..

ABN , Publish Date - Jan 23 , 2026 | 05:07 AM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్‌సను అద్భుతంగా ఆరంభించిన భారత జట్టు ఇప్పుడు మరో విజయంపై కన్నేసింది.

జోరు సాగనీ..

  • రెండో టీ20 బరిలో భారత్‌

  • ఫీల్డింగ్‌పై దృష్టి

  • బోణీ కోసం కివీస్‌

రాయ్‌పూర్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్‌సను అద్భుతంగా ఆరంభించిన భారత జట్టు ఇప్పుడు మరో విజయంపై కన్నేసింది. శుక్రవారం ఇరు జట్ల మధ్య రెండో టీ20కి రాయ్‌పూర్‌ వేదిక కానుంది. ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా టీ20 వరల్డ్‌క్‌పనకు ముందు ఆడబోయే చివరి సిరీస్‌ ఇదే. అందుకే అలక్ష్యానికి తావీయకూడదని భావిస్తోంది. అటు పర్యాటక కివీస్‌ తొలి మ్యాచ్‌లో కాస్త పోటీ ఇవ్వగలిగినా భారత్‌ భారీస్కోరు ముందు నిలవలేకపోయింది. నేటి మ్యాచ్‌లో మాత్రం సవాల్‌ విసిరి సిరీ్‌సను సమం చేయాలనుకుంటోంది.

1.jpg

శాంసన్‌, ఇషాన్‌లపై ఒత్తిడి

తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌ సంజూ శాంసన్‌తో పాటు రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్‌ కిషన్‌ విఫలమయ్యారు. ముఖ్యంగా శాంసన్‌ జట్టుతో పాటే ఉన్నా అవకాశాలు అప్పుడప్పుడు వచ్చేవి. ఇప్పుడు గిల్‌కు చోటు లేకపోవడంతో ఓపెనర్‌గా అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అటు వరల్డ్‌కప్‌ జట్టులోనూ చోటు దక్కించుకున్న ఇషాన్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని పొం దాలి. లేకుంటే శ్రేయా్‌సకు చోటు కోల్పోవాల్సి ఉంటుంది. ఇక కెప్టెన్‌ సూర్య 22 బంతుల్లో 32 రన్స్‌ చేసి ఆత్మవిశ్వాసాన్ని పొందాడు. అభిషేక్‌ ఆరంభంలో, రింకూ సింగ్‌ చివర్లో బాదుడు కీలకంగా నిలిచింది. అయితే ఫీల్డింగ్‌ వైఫల్యం ఇబ్బందిపెడుతోం ది. తొలి టీ20లో రెండు క్యాచ్‌లతో పాటు ఓ రనౌట్‌ మిస్‌ చేశారు. పేసర్లు అర్ష్‌దీప్‌, హార్దిక్‌ పవర్‌ప్లేలో వికెట్లు తీయ డం.. స్పిన్నర్‌ వరుణ్‌ ఒత్తిడి పెంచగలగడం సానుకూలాంశం కానుంది. మరోవైపు అక్షర్‌ పటేల్‌ గాయంపై స్పష్టత లేకపోవడంతో అతను ఆడేది సందేహమే.

బౌలర్లు రాణిస్తేనే..: నాగ్‌పూర్‌ టీ20లో కివీస్‌ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. పేసర్‌ జేకబ్‌ డఫీ మినహా అంతా భారత బ్యాటర్ల ధాటికి ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. అలాగే బ్యాటింగ్‌లో ఓపెనర్‌ కాన్వే ఎక్కువగా స్లిప్‌లో అవుటవుతున్న తీరుతో కివీస్‌ ఆందోళనగా ఉంది. ఫిలిప్స్‌ ఒక్కడు పోరాడినా.. మిడిలార్డర్‌లో ఇతరుల నుంచి భారీ భాగస్వామ్యా లు అందలేదు. వన్డే సిరీ్‌సతో పోలిస్తే ఇక్కడ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగినా కివీస్‌ దీటుగా ఆడలేకపోవడం దెబ్బతీసింది. అందుకే రాయ్‌పూర్‌లో సమష్టి ఆటతీరుతో గెలుపు రుచి చూడాలనుకుంటోంది.

Updated Date - Jan 23 , 2026 | 05:44 AM