The Ashes: ఆ తప్పిదమే మా ఓటమికి కారణమైంది: బెన్ స్టోక్స్
ABN , Publish Date - Jan 09 , 2026 | 06:39 AM
ఇంగ్లండ్‌పై ఇప్పటికే యాషెస్ సిరీస్ సాధించిన ఆతిథ్య ఆస్ట్రేలియా.. ఆఖరిదైన ఐదో టెస్టునూ సొంతం చేసుకుని సిరీస్‌ను 4-1తో ఘనంగా ముగించింది. ఐదో టెస్టులో కంగారూ జట్టు 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. తమ ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడాడు. మరో 100 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌పై ఇప్పటికే యాషెస్ సిరీస్ సాధించిన ఆతిథ్య ఆస్ట్రేలియా.. ఆఖరిదైన ఐదో టెస్టునూ సొంతం చేసుకుని సిరీస్‌ను 4-1తో ఘనంగా ముగించింది. ఐదో టెస్టులో కంగారూ జట్టు 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. మ్యాచ్‌లో ఆఖరి రోజు.. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. బదులుగా 160 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 31.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. తమ ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్( Ben Stokes) మాట్లాడాడు. మరో 100 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని తెలిపాడు.
‘బ్యాటింగ్ వైఫల్యంతోనే మేం ఓటమిని ఎదురుకోవాల్సి వచ్చింది. మేం తొలి ఇన్నింగ్స్‌లో మరో 100 పరుగులు అదనంగా చేసి ఉండాల్సింది. లేదా ఆస్ట్రేలియాను 100 పరుగులు తక్కువకే కట్టడి చేయాల్సింది. ఆస్ట్రేలియా అద్భుతమైన జట్టు. అందులో వ్యక్తిగత ప్రదర్శనలతో జట్టును ఆదుకునే ఆటగాళ్లు ఉన్నారు. ఈ విజయం క్రెడిట్ పూర్తిగా వారికే దక్కుతుంది. అయితే ఈ సిరీస్‌లో మేం ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సింది. మా లోపాలను సమీక్షించుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ఈ ఓటమిని విశ్లేషించుకోవడానికి మాకు చాలా సమయం ఉంది. వచ్చే జూన్‌లో మేం మళ్లీ టెస్టు క్రికెట్ ఆడనున్నాం. ఆ సమయానికి మా తప్పులన్నీ సరిదిద్దుకుంటాం’ అని స్టోక్స్ తెలిపాడు.
కెప్టెన్సీ నుంచి తప్పుకోను..
‘నా కెప్టెన్సీపై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడే కెప్టెన్సీ నుంచి తప్పుకునే ఆలోచన లేదు’ అని అన్నాడు. నాలుగో రోజు టెస్టులో స్టోక్స్ గాయం బారిన పడిన విషయం తెలిసిందే. ఆ విషయంపై కూడా అతడు స్పందించాడు. ‘నా కాలు గాయం కాస్త మెరుగ్గానే ఉంది. కొన్నిసార్లు తీవ్ర నొప్పితో ఇబ్బంది పడుతున్నాను. ఇంటికి వెళ్లే వరకు ఈ గాయంపై స్పష్టత రాదు’ అని వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి..
Punjab vs Mumbai: ఉత్కంఠ పోరులో పంజాబ్ సంచలన విజయం..
Hardik Pandya: హార్దిక్ పాండ్య సిక్సర్ల వర్షం .. భారీ స్కోరు చేసిన బరోడా..