Tilak Varma: తిలక్ వర్మకు గాయం
ABN , Publish Date - Jan 09 , 2026 | 03:51 AM
టీ20 ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగి లింది. జట్టు ఆపద్బాంధవ బ్యాటర్ తిలక్ వర్మకు పొత్తి కడుపు గాయమైంది.
రాజ్‌కోట్‌లో శస్త్రచికిత్స
కివీ్‌సతో మూడు టీ20లకు దూరం
ముంబై: టీ20 ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగి లింది. జట్టు ఆపద్బాంధవ బ్యాటర్ తిలక్ వర్మకు పొత్తి కడుపు గాయమైంది. దాంతో అతడికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఫలితంగా అతడు కొద్ది రోజులు ఆటకు దూరం కానున్నాడు. గాయం దరిమిలా న్యూజిలాండ్‌తో జరిగే తొలి మూడు టీ20లలో తిలక్ వర్మ ఆడడంలేదని బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా గురువారం రాత్రి తెలిపాడు. 23 ఏళ్ల తిలక్ వర్మ ప్రస్తుతం రాజ్‌కోట్‌లో జరుగుతున్న విజయ్ హజారే టోర్నీలో ఆడుతున్నాడు. బెంగాల్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. అయితే బుధవారం తిలక్‌కు హఠాత్తుగా పొత్తి కడుపులో తీవ్రంగా నొప్పి వచ్చింది. ‘తిలక్‌ను రాజ్‌కోట్‌లోని ఆసుపత్రికి తరలించగా, వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. ఆమేరకు అతడికి శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ తర్వాత అతడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు’ అని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు జయదేవ్ షా వెల్లడించాడు. అతడు కోలుకొనే తీరు ఆధారంగా న్యూజిలాండ్‌తో మిగిలిన టీ20లు ఆడించే విషయంపై నిర్ణయం తీసుకుంటారన్నాడు.