Home » Ben Stokes
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు అకస్మాత్తుగా రిటైర్‌మెంట్ ప్రకటించి అతడి అభిమానులతో పాటు క్రికెట్ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేశాడు. స్టోక్స్ నిర్ణయంపై ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ సోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. నైట్‌క్లబ్ వివాదం నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రిటైర్‌మెంట్ ప్రకటించాలని స్టోక్స్‌పై ఒత్తిడి తెచ్చిందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆ వార్తలపై స్టోక్స్ స్పందించాడు.
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు తనకు చివరిదని తెలిపాడు.
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా మెక్‌కల్లమ్ స్పందించాడు.
లండన్ నైట్‌క్లబ్‌లో జరిగిన గొడవ కారణంగా బెన్ స్టోక్స్‌పై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించి, న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టుకు సీనియర్ బ్యాటర్ జో రూట్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది.
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. ఓ నైట్ క్లబ్‌లో మద్యం తాగి ఓ రగ్బీ ప్లేయర్‌తో వాగ్వాదానికి దిగిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి.
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు విజయం అనంతరం.. ఇంగ్లండ్ ప్లేయర్లు మద్యం తాగి ఓ రగ్బీ ఆటగాడితో ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ రగ్బీ ప్లేయర్ ఎవరా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.
న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన ఆనందం ఇంగ్లండ్ జట్టుకు ఎక్కువసేపు నిలవలేదు. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, పేసర్ అట్కిన్సన్‌తో కలిసి ఫూటుగా మద్యం తాగి అపరిచితులపై దాడి చేసి వీరంగం సృష్టించారు.
ఇంగ్లండ్‌పై ఇప్పటికే యాషెస్ సిరీస్ సాధించిన ఆతిథ్య ఆస్ట్రేలియా.. ఆఖరిదైన ఐదో టెస్టునూ సొంతం చేసుకుని సిరీస్‌ను 4-1తో ఘనంగా ముగించింది. ఐదో టెస్టులో కంగారూ జట్టు 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. తమ ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడాడు. మరో 100 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని తెలిపాడు.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ గెలవడం గమనార్హం. మ్యాచ్ అనంతరం తన విజయంపై కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడాడు.