The Ashes: ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్
ABN , Publish Date - Dec 27 , 2025 | 03:47 PM
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ గెలవడం గమనార్హం. మ్యాచ్ అనంతరం తన విజయంపై కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఆసీస్ గడ్డపై దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ ఈ విజయాన్ని నమోదు చేయడం గమనార్హం. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్.. ఈ నామమాత్రపు మ్యాచుల్లో గెలిచి పరువు కాపాడుకోవాలని బరిలోకి దిగింది. ఇంతలోనే నూసాలో ఆటగాళ్లు మద్యం మత్తులో ఉన్న వీడియోలు వైరల్ అవ్వడం.. సిరస్ కోల్పోయామన్న ఒత్తిడి.. వీటన్నంటి నడుమ ఇంగ్లండ్ ఎట్టకేలకు విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం తమ ఈ చారిత్రక విజయంపై కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) మాట్లాడాడు.
‘ఇది మా అందరి విజయం. ఫలితం మాకు అనుకూలంగా రావడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. మేము మా కోసం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం ఆడుతున్నాం. స్టేడియానికి వచ్చి అభిమానులు ఇచ్చే ప్రోత్సహం మాకు ఎంతో శక్తినిస్తాయి. మ్యాచ్‌కు మాపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయినా ఆటగాళ్లు ఎవ్వరూ దృష్టిని చెదరకుండా ప్రదర్శన ఇచ్చారు. ఇదేమీ సులువైన ఛేజ్ కాదు. ప్రశాంతంగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలనుకున్నాం. అదే చేశాం. ఫలితం సానుకూలంగా వచ్చింది’ అని స్టోక్స్ వెల్లడించాడు.
టంగ్ చెలరేగాడు..
పేసర్ జోష్ టంగ్ (5/45, 2/44) అద్భుతమైన ప్రదర్శక చేశాడు. ఛేదనలో బెథెల్ 40 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ‘బాక్సింగ్ డే టెస్టులో ప్రేక్షకుల ముందు ఐదు వికెట్లు తీయడం విశేషం. టంగ్ జెర్సీ ధరించిన ప్రతిసారి తన శక్తిని మించిన ప్రదర్శన చేస్తాడు. బెథెల్ వంటి యువ ఆటగాళ్లు ఇలాంటి క్షణాల్లో ముందుకొచ్చి ఆడటం ఆనందంగా ఉంది’ అని స్టోక్స్ వివరించాడు.
ఇవి కూడా చదవండి
హర్మన్ ప్రీత్ ప్రపంచ రికార్డు.. అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా..!
దాదాపు 15 ఏళ్ల తర్వాత.. ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ ఘన విజయం