Share News

Harmanpreet Kaur: హర్మన్ ప్రీత్ ప్రపంచ రికార్డు.. అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా..!

ABN , Publish Date - Dec 27 , 2025 | 03:02 PM

టీమిండియా మహిళల జట్టు శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా మూడు మ్యాచులు గెలిచిన భారత్.. 3-0తో సిరీస్‌ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

Harmanpreet Kaur: హర్మన్ ప్రీత్ ప్రపంచ రికార్డు.. అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా..!
Harmanpreet Kaur

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మహిళా జట్టు శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచులు ఆడిన భారత్.. ఇంకా రెండు మ్యాచులు ఉండగానే సిరీస్‌ను దక్కించుకుంది. తిరువనంతపురం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచులో శ్రీలంకపై టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌ(Harmanpreet Kaur)ర్ ఓ ప్రపంచ రికార్డను నెలకొల్పింది.


ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 గెలిచిన తర్వాత ఈ టీమిండియాకు ఇదే తొలి సిరీస్. తొలి మ్యాచు నుంచే తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న భారత అమ్మాయిలు.. విజయ పరంపరను కొనసాగిస్తూ మూడు టీ20ల్లో ఘన విజయాలు నమోదు చేశారు. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సత్తా చాటారు. అయితే హర్మన్ ప్రీత్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది 77వ విజయం. తద్వారా అంతర్జాతీయ మహిళల పొట్టి క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన సారథిగా హర్మన్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి.. ఈ జాబితాలో తొలి స్థానానికి ఎగబాకింది.


ఈ జాబితాలో ఉన్నదెవరంటే..?

  • హర్మన్ ప్రీత్ కౌర్(భారత్)- 130 మ్యాచుల్లో 77 విజయాలు

  • మెగ్ లానింగ్(ఆస్ట్రేలియా)- 100 మ్యాచుల్లో 76 విజయాలు

  • హీదర్ నైట్(ఇంగ్లండ్)- 96 మ్యాచుల్లో 72 విజయాలు

  • చార్లెట్ ఎడ్‌వర్డ్స్(ఇంగ్లండ్)- 93 మ్యాచుల్లో 68 విజయాలు

  • ఎన్ చైవాయి(థాయ్‌లాండ్)- 79 మ్యాచుల్లో 55 విజయాలు


ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

Vignesh Puthur Creates History: 32 ఏళ్ల రికార్డ్ బద్దలు.. చరిత్ర సృష్టించిన విజ్ఞేష్

Updated Date - Dec 27 , 2025 | 03:02 PM