Share News

Swastik Samal: ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

ABN , Publish Date - Dec 25 , 2025 | 08:32 PM

ఒడిశాకు చెందిన 25 ఏళ్ల స్వస్తిక్ సామల్ ఐపీఎల్ లో ఆడాలని కలలు కంటున్నాడు. అంతేకాక ఐపీఎల్‌లో ఆడేందుకు తీవ్రంగా ప్రయ‌త్నిస్తాడు. కానీ ప్రతీసారి అత‌డికి నిరాశే ఎదురైంది. కట్ చేస్తే.. తాజాగా విజయ్ హజారే టోర్నీలో డబుల్ సెంచరీతో చెలరేగాడు.

Swastik Samal: ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
Swastik Samal

ఇంటర్నెట్ డెస్క్: యువ క్రికెటర్లు తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ఒక సరైన వేదిక. ఎంతో మంది ఆటగాళ్లు దీని ద్వారా సత్తాచాటి క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యారు. కనీసం ఒక్కసారైనా ఐపీఎల్‌లో భాగం కావాలని భాగం కావాలని ప్రతి ఒక్క ప్లేయర్ కలలు కంటాడు. అలా కలలు కన్న ఓ దేశవాళీ ప్లేయర్ ను రిజెక్ట్ చేసింది. సీన్ కట్ చేస్తే.. విజయ్ హజారే టోర్నీ 2025-26 డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు. మరి.. ఆ ఆటగాడు ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


ఒడిశాకు చెందిన 25 ఏళ్ల స్వస్తిక్ సామల్(Swastik Samal) ఐపీఎల్ లో ఆడాలని కలలు కంటున్నాడు. అంతేకాక ఐపీఎల్‌లో ఆడేందుకు తీవ్రంగా ప్రయ‌త్నిస్తాడు. కానీ ప్రతీసారి అత‌డికి నిరాశే ఎదురైంది. అయినా నిరుత్సాపడకుండా... ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌-2026 మినీ వేలంలో కూడా అత‌డు త‌న పేరును రూ.30 ల‌క్షల కనీస ధరకు రిజస్టర్ చేసుకున్నాడు. అయితే ఈ సారి కూడా అతడికి నిరాశే మిగిలింది. దుర‌దృష్టవశాత్తూ తుది వేలం జాబితాలో (369 మంది) స్వస్తిక్ కి చోటు దక్కలేదు. కానీ అతడు కొంచెం కూడా బాధ పడలేదు. తన సత్తాను మైదానంలోనే చూపించాలని నిర్ణయించుకున్నాడు.


ఈ క్రమంలో విజ‌య్ హాజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2025-26)లో భాగంగా అలూర్ వేదిక‌గా సౌరాష్ట్రతో జ‌రిగిన మ్యాచ్‌లో స్వస్తిక్ సామ‌ల్ డబుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన స్వస్తిక్.. ప్రత్యర్ధి బౌల‌ర్లకు చుక్కలు చూపించాడు. అలూర్ గ్రౌండ్ లో బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. కేవ‌లం 169 బంతుల్లో 21 ఫోర్లు, 8 సిక్సర్లతో ఏకంగా 212 ప‌రుగులు చేశాడు. ఫ‌లితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఒడిషా నిర్ణీత 50 ఓవ‌ర్లలో ఏకంగా 6 వికెట్ల న‌ష్టానికి 345 ప‌రుగులు చేసింది. అయితే స్వస్తిక్ ద్విశతకం వృథా అయింది. ఒడిషా జట్టు ఓటమి పాలైంది.


346 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన సౌరాష్ట్ర 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఒడిశా ఓడిపోయిన‌ప్పటికి స్వస్తిక్ సామ‌ల్(Swastik Samal) ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అంతేకాకుండా లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఒడిశా ప్లేయ‌ర్‌గా స్వస్తిక్ చరిత్ర సృష్టించాడు. ఈ అత్యధిక వ్యక్తిగ‌త స్కోర్ సాధించిన ఐద‌వ ఆట‌గాడిగా ఏకంగా సంజూ శాంసన్ (212*) రికార్డును సమం చేశాడు. దీంతో సామ‌ల్ గురించి తెలుసుకోవడానికి నెటిజ‌న్లు ఆస‌క్తి చూపుతున్నారు.


ఇక స్వస్తిక్ సామ‌ల్‌ వ్యక్తిగత విషయానికి వస్తే.. అతడు ఒడిశాలోని కోరాపుట్‌లో జ‌న్మించాడు. ఒడిషా అండర్-16, అండర్-19, అండర్-23 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. స‌య్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో స్వస్తిక్ మిజోరంపై టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది లిస్ట్‌-ఎ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. స్వస్తిక్ సామల్(Swastik Samal) అండర్-16, అండర్-19 ,అండర్-23 స్థాయిలలో ఒడిషా కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతడు ఇప్పటివరకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 686 పరుగులతో పాటు లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 521 పరుగుల నమోదు చేశాడు. అదేవిధంగా టీ20ల్లో 13 మ్యాచ్‌లు 362 పరుగులు చేశాడు. అయితే మూడు ఫార్మాట్లలోనూ అతడి పేరిట శతకం ఉంది.


ఇవీ చదవండి:

బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ

Rinku Singh Vijay Hazare Trophy: చెలరేగి ఆడిన రింకూ సింగ్..

Updated Date - Dec 25 , 2025 | 08:32 PM