Man Falls From 10th Floor: చావును మోసం చేసిన వ్యక్తి.. 10వ అంతస్తు నుంచి కిందపడ్డా కూడా..
ABN , Publish Date - Dec 25 , 2025 | 06:22 PM
ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు 10వ అంతస్తు నుంచి కిందపడ్డాడు. అయినా కూడా అతడి ప్రాణాలుపోలేదు. ఆశ్చర్యంగా ఉంది. అతడెలా బతికాడో తెలుసుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే.
సాధారణంగా హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లోని ఫైట్ సీన్లలో పెద్ద పెద్ద భవంతుల మీదకు దూకటం. 20వ అంతస్తు మీదనుంచి కిందపడ్డా కూడా ప్రాణాలు పోకపోవటం వంటివి కామన్‌గా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి చూసినపుడు మనకు ఫేక్ లాగా అనిపిస్తుంది. ఇలా సినిమాల్లో తప్ప ఎక్కడా జరగదు అనిపిస్తుంది. అయితే, నిజ జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్టోరీ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు 10వ అంతస్తు నుంచి కిందపడ్డాడు. అయినా కూడా అతడి ప్రాణాలుపోలేదు.
ఆశ్చర్యంగా ఉంది. అతడెలా బతికాడో తెలుసుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే. గుజరాత్‌లోని సూరత్, జహంగీర్‌పురకు చెందిన 57 ఏళ్ల నితిన్ భాయ్ అదియా అనే వ్యక్తి బుధవారం ఉదయం 8 గంటల సమయంలో టైమ్స్ గెలాక్సీ బిల్డింగ్స్‌లోని తన ప్లాట్‌లో నిద్రపోతూ ఉన్నాడు. అది కూడా 10వ అంతస్తులో ఉన్న ప్లాట్ కిటికీ దగ్గర నిద్రపోతూ ఉన్నాడు. ప్రమాదవశాత్తు కిందకు పడిపోయాడు. అయితే, అదృష్టం బాగుండి అతడు పూర్తిగా కిందపడలేదు. 8వ అంతస్తులోని కిటికీ గ్రిల్‌లో చిక్కుకున్నాడు. అతడి కాలు గ్రిల్ సందులో ఇరుక్కుపోయింది. దీంతో కిందపడకుండా అక్కడే ఉండిపోయాడు.
8వ అంతస్తులో గబ్బిలంలా వేలాడుతూ ఉన్నాడు. ఇది గమనించిన అక్కడి వారు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. జహంగీర్‌పుర, పలన్‌పుర్, అడజన్‌లోని అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అతి కష్టం మీద అతడ్ని అక్కడినుంచి కిందకు దించారు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. మృత్యుంజయుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇంగ్లాండ్ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి సరైనోడు.. మాజీ ప్లేయర్ కీలక కామెంట్స్
పెళ్లై 27 రోజులు.. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి..