Share News

Newlywed Woman: పెళ్లై 27 రోజులు.. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి..

ABN , Publish Date - Dec 25 , 2025 | 05:34 PM

ఓ కొత్త పెళ్లి కూతురి జీవితం అర్థాంతరంగా ముగిసింది. పెళ్లైన 27 రోజులకే అత్తింట్లో శవమై తేలింది. యువతి తల్లిదండ్రులు తమ కూతురిది హత్య అని అంటున్నారు. అల్లుడే కొట్టి చంపేశాడని ఆరోపిస్తున్నారు.

Newlywed Woman: పెళ్లై 27 రోజులు.. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి..
Newlywed Woman

కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఓ కొత్త పెళ్లి కూతురి జీవితం అర్థాంతరంగా ముగిసింది. పెళ్లైన 27 రోజులకే అత్తింట్లో శవమై తేలింది. ఈ సంఘటన కర్ణాటకలో బుధవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నేలమంగళకు చెందిన మమత, క్రిష్ణమూర్తి దంపతుల కూతురు ఐశ్వర్యకు బాగల్‌‌గుంటే పైప్‌లైన్, మల్లసంద్ర ప్రాంతానికి చెందిన లిఖిత్ సింహతో 27 రోజుల క్రితం పెళ్లయింది. ఐశ్వర్య కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టింది. 27 రోజులు చకచకా గడిచిపోయాయి.


బుధవారం సాయంత్రం ఐశ్వర్య తల్లిదండ్రులకు లిఖిత్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అతడు వారికి చెప్పాడు. కూతురు చనిపోయిందని తెలిసి వారు షాక్ అయ్యారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. హుటాహుటిన లిఖిత్ ఇంటికి చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు లిఖిత్ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ఐశ్వర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ఐశ్వర్య తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిది హత్య అని అంటున్నారు.


వారు చెబుతున్న దాని ప్రకారం.. పెళ్లైన కొన్ని రోజులకే అత్తింట్లో ఐశ్వర్యకు వేధింపులు మొదలయ్యాయి. భర్త ఆమెను ప్రతీ రోజూ కొట్టేవాడు. రోజు రోజుకు అతడి వేధింపులు పెరగటంతో ఐశ్వర్య ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు మంగళవారం గొడవలపై ఐశ్వర్య అత్తింటి వారితో మాట్లాడారు. అయితే, అదే రోజు సాయంత్రం కూడా లిఖిత్ తన భార్యపై దాడి చేశాడు. కొన్ని గంటలకే ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది. ఇక, ఈ కేసుకు సంబంధించి పోలీసులు లిఖిత్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి

సోషల్‌ మీడియా యాప్స్‌ వినియోగంపై సిబ్బందికి ఆర్మీ మార్గదర్శకాలు

షేక్‌ హసీనా స్థానం నుంచి హిందూ నేత పోటీ!

Updated Date - Dec 25 , 2025 | 05:39 PM