Share News

Indian Army: సోషల్‌ మీడియా యాప్స్‌ వినియోగంపై సిబ్బందికి ఆర్మీ మార్గదర్శకాలు

ABN , Publish Date - Dec 25 , 2025 | 04:47 PM

సోషల్ మీడియా యాప్స్ వినియోగంపై సిబ్బంది ఇండియన్ ఆర్మీ కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియా యాప్స్‌లలో ఎలాంటి వ్యాఖ్యలు, అభిప్రాయాలు తెలుపకూడదని ఆర్మీ స్పష్టం చేసింది. భద్రత, సున్నితమైన సమాచారంపై..

Indian Army: సోషల్‌ మీడియా యాప్స్‌ వినియోగంపై సిబ్బందికి ఆర్మీ మార్గదర్శకాలు
Army social media guidelines

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: సోషల్ మీడియా యాప్స్ వినియోగంపై సిబ్బంది ఇండియన్ ఆర్మీ కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియా యాప్స్‌లలో ఎలాంటి వ్యాఖ్యలు, అభిప్రాయాలు తెలుపకూడదని ఆర్మీ స్పష్టం చేసింది. భద్రత, సున్నితమైన సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పర్యవేక్షణ ప్రయోజనాల కోసం మాత్రమే ఇన్‌స్టా, ఎక్స్ యాక్సెస్ ఉంటుందని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. యాప్స్‌లో పోస్టింగ్స్, లైక్స్, కామెంట్స్ చేయడంపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. కమ్యూనికేషన్ కోసం సిబ్బంది సురక్షితమైన యాప్స్‌ని వినియోగించాలని ఆర్మీ ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది ఆర్మీ.. జాతీయ భద్రత కోసం ఈ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాల్సిందేనంటూ సిబ్బందిని ఆదేశించింది.


Also Read:

Bangladesh Elections:షేక్‌ హసీనా స్థానం నుంచి హిందూ నేత పోటీ!

Drunk driving Hyderabad: మందు బాబులకు అలర్ట్.. హైదరాబాద్‌లో డిసెంబర్ 31 వరకు..

Fitness Secret: 40 ఏళ్ల వయసులోనూ నవ యవ్వనంగా ఉండాలంటే.. అదిరిపోయే సీక్రేట్స్..

Updated Date - Dec 25 , 2025 | 04:47 PM