Drunk driving Hyderabad: మందు బాబులకు అలర్ట్.. హైదరాబాద్‌లో డిసెంబర్ 31 వరకు..
ABN , Publish Date - Dec 25 , 2025 | 04:28 PM
మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగర వాసులకు పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా, పది వేల రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు ప్రారంభించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. బుధవారం ప్రారంభమైన ఈ తనిఖీలు డిసెంబర్ 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. నగరంలో 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు ఉంటాయని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు (Hyderabad drunk and drive checks).
తొలి రోజు అయిన బుధవారమే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో 304 మందిని పట్టుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 304 మంది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగర వాసులకు పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా, పది వేల రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు (special checks till December 31).
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం పబ్‌లకు వెళ్లే వారు తమ డ్రైవర్లను వెంట తీసుకెళ్లాలని కమిషనర్ తెలిపారు (year end drunk driving checks). లేదంటే క్యాబ్ బుక్ చేసుకుని ప్రయాణించాలని సూచించారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా సెలబ్రేషన్స్ చేసుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
సింపతీ పెంచే కుట్ర.. సీఎం రేవంత్‌పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News