Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:44 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ నేటితో ముగియనుంది. ఈ కేసులో నిందితులందరితో కలిపి ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 25: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులందరినీ సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్‌రావు, తిరుపతన్నలను పిలిచిన సిట్.. వారిని విచారిస్తున్నారు. నేటితో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగియనుండటంతో అందిరితో కలిపి దర్యాప్తు చేస్తోంది సిట్. అందులోభాగంగా ఇప్పటికే సిట్ అధికారి రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సిట్ ఆఫీసుకు చేరుకున్నారు. నేటితో ప్రభాకర్ రావు 14 రోజుల విచారణ ముగియనుండగా.. రేపు(శుక్రవారం) 10 గంటలకు పోలీస్ కస్టడీ నుంచి విడుదల కానున్నారు.
అయితే.. 14 రోజుల కస్టడీలో ప్రభాకర్‌రావు ఏం చెప్పారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలకు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ సమాధానం చెప్పనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పెన్ డ్రైవ్‌ను సిట్ అధికారులు కీలక ఆధారంగా భావించారు. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా పని చేసిన కాలంలో పెన్ డ్రైవ్‌లో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు పెట్టి మరీ విచారించింది సిట్. అయితే 6 వేల ఫోన్ నెంబర్లు ఉన్నప్పటికీ పెన్‌డ్రైవ్‌పై ప్రభాకర్ రావు ఎలాంటి జవాబు ఇవ్వనట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
స్కూల్ బస్ బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు
పిచ్చికుక్క దాడి.. 20 మంది భక్తులకు గాయాలు
Read Latest Telangana News And Telugu News