Home » Phone tapping
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని గురువారం విచారణ చేశారు.
మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ పొడిగించిన సుప్రీం కోర్టు. తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.
సోషల్ మీడియాలో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం, కించపరచటం మంచిది కాదు తప్పకుండా చర్యలు ఉంటాయని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరగాలని వీసీ సజ్జనార్ సూచించారు.
ప్రభాకర్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు న్యాయస్థానంలో విచారణ జరిగింది.
బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువుపై ఉన్నత న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు బీసీ రిజర్వేషన్ విషయంలో వేచి చూస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పుకొచ్చారు. జంతర్ మంతర్ వద్ద తమ నిరసన ధర్నాకు బీజేపీ ఎంపీలు ఎందుకు మద్దతు పలకలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో తొలి బాధితుడిని తానేనని.. తన ఫోన్‌ను నిరంతరం ట్యాప్ చేశారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. విచారణాధికారులు ఇచ్చిన ఫోన్ నంబర్లు చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిసింది.