కాంగ్రెస్ సర్కార్ సాధించిందేమీలేదు.. ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:32 PM
ఫోన్ ట్యాపింగ్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని, ఇందులో సూత్రధారులను శిక్షించిన పాపాన పోలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు.. రోజువారీ టీవీ సీరియల్‌గా మారిందన్నారు.
న్యూఢిల్లీ, జనవరి 29: తెలంగాణ రాష్ట్రంలో స్కామ్‌లు వేగంగా పరిగెడుతున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Lakshman) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారని.. కానీ అమలు కావడం లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా, వైఫల్యాలను మెరుగుపరచడానికి కాలయాపన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కుంభకోణాలు, అవినీతి, మంత్రుల మధ్య గొడవలు రోజువారీ వార్తలుగా మారాయని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రం స్కామ్‌లకు పరిశోధన కేంద్రంగా మారిందని ఆయన అన్నారు.
కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై స్పందిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రోజువారీ టీవీ సీరియల్‌గా మార్చారని, రోజుకో పేరును ప్రస్తావిస్తూ సిట్ పేరిట కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ సాధించలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులను శిక్షించిన పాపాన పోలేదని ఎంపీ విమర్శించారు.
తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందనే అనే భయంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి గేమ్ ఆడుతున్నాయని ఎంపీ ఆరోపించారు. మున్సిపాలిటీలలో కనీస సదుపాయాలు కల్పించడం లేదన్నారు. 106 మున్సిపాలిటీల అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం స్మార్ట్ సిటీ, పట్టణాల అభివృద్ధి కోసం పని చేస్తోందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తేనే ప్రోగ్రెస్ జరుగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఒక వర్గాన్ని సంతోషపరచడం కోసమే పని చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ.. ఓ ఫెయిల్యూర్ నాయకుడు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు!
కేసీఆర్‌కు నోటీసులు.. కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News