వేధింపులకు భయపడం.. ప్రజలంతా కేసీఆర్ వెంటే: హరీశ్ రావు
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:57 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని వ్యాఖ్యానించారు..
హైదరాబాద్, జనవరి 29: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు(Former CM KCR) సిట్ అధికారులు నోటీసుల జారీ చేసిన విషయం తెలిసిందే. సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీశ్ రావు (Former Minister Harish Rao) స్పందిస్తూ.. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత, కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడైన కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. అలాంటి మహానేతపై బురదజల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమే అని అన్నారు. పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర, చౌకబారు రాజకీయాలకు రేవంత్ రెడ్డి పరాకాష్ట అంటూ ఫైర్ అయ్యారు.
రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘అధికారం, అహంకారం శాశ్వతం కాదు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే. ఈ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజలే తగిన బుద్ధి చెబుతారు’ అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు!
కేసీఆర్‌కి సిట్ నోటీసులు.. మహేశ్ గౌడ్ రియాక్షన్..
Read Latest Telangana News And Telugu News