Home » Harish Rao
రాష్ట్రంలో రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరా తగ్గిందని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు.
సిరిసిల్ల అభివృద్ధిపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ హయాంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు.
దైవ దర్శనానికి పుణ్యక్షేత్రాలకు వెళ్తే.. రాష్ట్రంలో వర్షాలు పడకూడదంటూ తాను క్షుద్ర పూజలు చేశానని, తనపై ఘోరమైన అపవాదు వేసి, పరువుకు భంగం కలిగించారని.. బుధవారం బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.
రాష్ట్ర పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన తెలంగాణ సచివాలయం. కాంగ్రెస్ పాలనలో నిరసనలకు అడ్డాగా మారిందని, ఇది సిగ్గుచేటని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు పేర్కొన్నారు.
దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ జారీ చేసిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ నేతలు స్వాగతిస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని ఆ పార్టీ ముఖ్య నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 7 గంటలకు మించి విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆయన ఆరోపించారు.
కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నా బేసిన్ ద్వారా కుప్పం వరకూ తరలిస్తుంటే.. పక్కనేఉన్న పాలమూరుకు ఎందుకు తరలించడం లేదని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు.
హరీశ్‌రావు రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ, రాష్ట్రంలో కరువు, విద్యుత్తు కోతలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, ప్రజలు మళ్లీ కేసీఆర్‌కు మద్దతు ఇస్తారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ప్రశ్నించిన వాళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ రోజు(ఆదివారం)యాదాద్రిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
ఫాంహౌజ్ చుట్టూ సుడా పేరిట భూకబ్జా చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత తీవ్రంగా స్పందించారు. ఆయనపై బురదజల్లే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అబద్దాలు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.