సిట్ విచారణలో హరీశ్ రావును అడిగే ప్రశ్నలు ఇవే

ABN, Publish Date - Jan 20 , 2026 | 10:33 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

హైదరాబాద్, జనవరి 20: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో(Phone Tapping Case) మాజీ మంత్రి హరీశ్ రావు (Former Minister Harish Rao) సిట్ ముందు విచారణకు హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో హరీశ్‌ను సిట్ విచారించనుంది. ఈ కేసులో సుదీర్ఘంగా విచారణ జరిపి హరీశ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసే అవకాశముంది. హరీశ్‌తో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


ఈ కేసుకు సంబంధించి హైకోర్టు, సుప్రీం కోర్టులో క్లీన్ చిట్ వచ్చిందని హరీశ్ మీడియాకు తెలిపారు. అయితే.. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను మాత్రమే తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసిందని... ప్రస్తుతం.. 2024 మార్చి 10న నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా రోజువారీ విచారణ కొనసాగుతోందని.. అందులో భాగంగానే హరీశ్ రావుకు నోటీసులు జారీచేసిన సిట్.. స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనుంది.


ఇవీ చదవండి:

తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు.. కేటీఆర్, హరీశ్ రావు ఆధ్వర్యంలో కీలక భేటీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Updated at - Jan 20 , 2026 | 10:48 AM