BRS: తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు.. కేటీఆర్, హరీశ్ రావు ఆధ్వర్యంలో కీలక భేటీ
ABN , Publish Date - Jan 20 , 2026 | 08:56 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
హైదరాబాద్, జనవరి 20: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, హరీశ్ రావు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో కేటీఆర్, హరీశ్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలతో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హరీశ్ రావును ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది.
ఇదిలా ఉండగా, తెలంగాణ భవన్ నుంచి హరీశ్ రావు సిట్ విచారణకు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన సిట్ ఎదుట హాజరుకానున్నారు. దీనికి మద్దతుగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు.
ఈ ఉదయం తన నివాసంలో అడ్వకేట్లతో సమావేశమైన హరీశ్ రావు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ విచారణలో మాట్లాడాల్సిన అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన నివాసానికి కేటీఆర్ చేరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..
ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి
Read Latest Telangana News and National News