Share News

Indian Ambassador Mridul Kumar: ఏపీలో స్విస్‌ పెట్టుబడులకు సహకరించండి

ABN , Publish Date - Jan 20 , 2026 | 06:04 AM

ఏపీలో స్విస్‌ పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

Indian Ambassador Mridul Kumar: ఏపీలో స్విస్‌ పెట్టుబడులకు సహకరించండి

  • జ్యూరిక్‌లో రాయబారి మృదుల్‌ కుమార్‌కు చంద్రబాబు వినతి

అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి ): ఏపీలో స్విస్‌ పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దావోస్‌ సదస్సులో పాల్గొనేందుకువెళ్లిన ఆయన, జ్యూరిక్‌లో మృదుల్‌ కుమార్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాల గురించి మృదుల్‌కు వివరించారు. ఫార్మా, వైద్య పరికరాల తయారీ, యంత్ర పరికరాలు, భారీ మెషినరీ, హార్డ్‌ వేర్‌, ఎలకా్ట్రనిక్స్‌ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉన్నదన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల విధానాలు అనుసరిస్తున్నామని వివరించారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానం అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.

Updated Date - Jan 20 , 2026 | 06:05 AM