Share News

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

ABN , Publish Date - Jan 20 , 2026 | 08:46 AM

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని టాలీవుడు హీరోహీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, ప్రముఖ నటుడు శివ బాలాజీ తదితరులు దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకున్నారు.

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల, జనవరి 20: తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారిని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దర్శించుకున్నారు. టాలీవుడ్ హీరోహీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, హీరో శివబాలాజీలతోపాటు దర్శకుడు మారి, రచయిత చిన్మయ్‌ దర్శించుకున్నారు. ఆటో రాంప్రసాద్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, రాంభూపాల్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.


ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆలయం వెలుపల నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి మాట్లాడారు. అనగనగా ఒక రాజు చిత్రం ఘన విజయం సాధించిందన్నారు. తిరుమల వెంకన్న తన ఇష్టదైవమని తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతోనే ఈ చిత్రం ఇంతటి ఘన విజయాన్ని అందుకుందని అన్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.


సోమవారంతోనే ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్‌ దాటిందని హీరో నవీన్ పోలిశెట్టి తెలిపారు. తన ప్రతి చిత్రం విజయం సాధిస్తే తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని చెప్పారు. ప్రస్తుతం తాను రెండు చిత్రాల్లో నటిస్తున్నానని పేర్కొన్నారు. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ప్రస్తుతం నాగచైతన్యతో పాటు పలు చిత్రాల్లో తానూ నటిస్తున్నానన్నారు. నాగ చైతన్యతో నటిస్తున్న చిత్రం ఈ ఏడాది విడుదల అవుతుందని హీరోయిన్ మీనాక్షి చౌదరి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పిల్లనివ్వండి..! పెళ్లి కోసం వినూత్న ఫ్లెక్సీ

ఏపీలో స్విస్‌ పెట్టుబడులకు సహకరించండి

For More AP News And Telugu News

Updated Date - Jan 20 , 2026 | 01:24 PM