Home » Tirumala Tirupathi
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ, పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పరకామణి చోరీ కేసుపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసుపై వాదనలు జరిగాయి. అనంతరం ఈ కేసుపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
దిత్వా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భక్తుల రక్షణ దృష్ట్యా తిరుపతి జిల్లా పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. దిత్వా తుఫాను నేపథ్యంలో భక్తులకు, జిల్లా ప్రజలకు భద్రతా సూచనలు సూచించారు .
తిరుమల వేంకటేశ్వరస్వామి కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 24 మంది నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో 17 మంది నిందితుల పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో పూర్తిగా విద్యుత్ బస్సులను వినియోగంలోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇప్పుడున్న డీజల్, పెట్రోల్ ట్యాక్సీలు, టీటీడీ అద్దెవాహనాలను దశలవారీగా రద్దు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా పనిచేశాను తప్ప.. దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
కలియుగ వైంకుఠ నాథుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని ప్రపంచవ్యాప్తంగా భక్తులు పూజిస్తుంటారు. క్షణకాలమైనా నిత్య అలంకార ప్రియుడు శ్రీవారి దర్శనం దొరికితే చాలని భక్తులు భావిస్తుంటారు.
మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ఈ నెల 20న సిట్ విచారించనుంది. విచారణకు తిరుపతికి రావాలని దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే..
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.
టీటీడీ చేపట్టిన వేదపారాయణ పోస్టుల ఇంటర్వ్యూల్లో తొలిరోజే వివాదం మొదలైంది. 700 పోస్టులకుగాను తిరుపతిలోని శ్వేతలో సోమవారం మొదలైన ఇంటర్వ్యూలు 16వ తేదీ వరకు జరగనున్నాయి.