Share News

జగన్ హయాంలో తిరుమలలో మహాపాపం చేశారు.. సీఎం చంద్రబాబు ఫైర్

ABN , Publish Date - Feb 01 , 2026 | 05:06 PM

ఎన్‌డీబీబీ నివేదిక ఆధారంగానే తాను తిరుమల గురించి మాట్లాడానని ఏపీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకే.. గతంలో సిన్సియర్‌ అధికారి శ్యామలరావును నియమించామని తెలిపారు..

జగన్ హయాంలో తిరుమలలో మహాపాపం చేశారు..  సీఎం చంద్రబాబు ఫైర్
AP CM Chandrababu Naidu

చిత్తూరు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఎన్‌డీబీబీ (NDDB) నివేదిక ఆధారంగానే తాను తిరుమల గురించి మాట్లాడానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకే.. గతంలో సిన్సియర్‌ అధికారి శ్యామలరావును నియమించామని తెలిపారు. తిరుమలలో వైసీపీ హయాంలో మహాపాపం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కుప్పంలో సీఎం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.


టీటీడీ అక్రమాలపై సిట్‌ వేశాం..

జగన్ హయాంలో తిరుమలలో అపచారం చేసి తిరిగి తమపైనే ఎదురుదాడి చేస్తున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. టీటీడీలో జరిగిన అక్రమాలపై సిట్‌ వేశామని ప్రస్తావించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు తాను సిట్‌ వేస్తే.. తిరిగి తననే క్షమాపణలు చెప్పాలని అంటున్నారని ఆగ్రహించారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్ట చేశారు. తిరుమల వేంకటేశ్వరుడు తమ కులదైవమని, తాను ఎప్పుడూ సామాన్య భక్తుడిలానే స్వామివారిని దర్శించుకుంటానని చెప్పారు. అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బడ్జెట్‌లో ఏపీకి భారీ నిధులు.. అమరావతికి ప్రత్యేక ప్యాకేజీ

చరిత్రలో లేని మెజార్టీ కూటమికే దక్కింది: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 05:31 PM