బడ్జెట్‌లో ఏపీకి భారీ నిధులు.. అమరావతికి ప్రత్యేక ప్యాకేజీ
ABN , Publish Date - Feb 01 , 2026 | 03:14 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధి, విద్యారంగాలకు సంబంధించి స్పష్టమైన నిధుల కేటాయింపులు జరిగాయి.
ఢిల్లీ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధి, విద్యారంగాలకు సంబంధించి స్పష్టమైన నిధుల కేటాయింపులు జరిగాయి.
అమరావతి, ఏపీ మౌలిక సదుపాయాల నిధులు
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు వివిధ విభాగాల ద్వారా నిధులు మంజూరయ్యాయి.
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి: ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో సుమారు రూ.1,128.91 కోట్లని ప్రాథమికంగా కేటాయించింది.
అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్: ఐబీఆర్‌డీ (IBRD) నిధుల ద్వారా రూ.432.09 కోట్లు.
పట్టణ తాగునీరు, మురుగునీటి పారుదల: ఏపీలోని పట్టణ ప్రాంతాల కోసం రూ.800 కోట్లు.
గ్రామీణ రహదారులు: ఏపీ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు.
రహదారులు, వంతెనలు: పునర్నిర్మాణ పనుల నిమిత్తం రూ.350 కోట్లు.
వ్యవసాయం, పరిశోధన:
ప్రకృతి వ్యవసాయం (Natural Farming): ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో రూ.155.32 కోట్లు కేటాయించింది.
విద్యాసంస్థలకు కేంద్ర గ్రాంట్లు: కేంద్ర ప్రభుత్వం పలు విభాగాల ద్వారా ఏపీలోని ప్రముఖ ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలకు పరిశోధనా గ్రాంట్లను ప్రకటించింది.
అణుశక్తి విభాగం (Department of Atomic Energy) నుంచి:
ఎస్‌ఆర్‌ఎం (SRM) అమరావతి
గీతం విశ్వవిద్యాలయం (ఆంధ్రప్రదేశ్)
అంతరిక్ష విభాగం (Department of Space) నుంచి:
అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికత అభివృద్ధి కోసం ఈ క్రింది సంస్థలని కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో ఎంపిక చేసింది.
వీఆర్.సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ (విజయవాడ)
త్రిపుల్ ఐటీ (IIIT) శ్రీసిటి
గీతం బెంగళూరు
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌పై బదిలీ వేటు..
దావోస్ పర్యటనలో ఏపీని బెస్ట్‌గా ప్రమోట్ చేశాం: మంత్రి టీజీ భరత్
Read Latest AP News And Telugu News