Home » BudgetSession
ఏపీ 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ ప్రతులను దుర్గమ్మ సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ త్వరలో పూర్తవ్వాలని, దోషులను జైలుకు పంపాలని కోరారు.
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సమర్పించిన 2026– 2027 కేంద్ర బడ్జెట్‌ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
దేశ అభివృద్ధిలో రాజీ పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. రూ.53 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ఉందని పేర్కొన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధి, విద్యారంగాలకు సంబంధించి స్పష్టమైన నిధుల కేటాయింపులు జరిగాయి.
2047 వికసిత్ భారత్ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ(ఆదివారం) బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌తో ఏపీకి కొత్త అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు..
కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్షత ఉందన్నారు. తెలంగాణపై బడ్జెట్‌లో వివక్షత చూపిస్తే బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలని అన్నారు..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో రికార్డు అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆమె అనుభవాన్ని, ఒకే ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు.