ఆరు గ్యారంటీలకు రేవంత్, భట్టి ఘోరీ కట్టారు: హరీశ్‌రావు
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:36 PM
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బోగస్, బడా జూటా అని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) షాకింగ్ కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బోగస్, బడా జూటా అని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఘోరీ కట్టారని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్‌ను చూస్తే ఎన్నికల హామీలపై కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమైందని అన్నారు. ఈ బడ్జెట్‌లో గతం కంటే 20పేజీలు పెంచారు తప్ప.. హామీలకు కేటాయింపులు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి.. అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారని ధ్వజమెత్తారు.
సీఎం ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు..
సీఎం ప్రజలకే కాదని.. ఎమ్మెల్యేలకు సైతం అందుబాటులో ఉండటం లేదని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 3లక్షల పింఛన్లు కట్ చేసి.. 2లక్షల కొత్త పెన్షన్లు ఇస్తామంటున్నారని అన్నారు. కోటీశ్వరులు సంగతి అటుంచి.. మొదట మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీవ్, ఇందిరమ్మ పేర్లతో అమలవుతోన్న స్కీంలకు సైతం కేటాయింపులు ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ది.. అభయ హస్తం కాదని.. రిక్త హస్తమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది మూడు ముక్కలాట తప్ప.. విజన్ లేదని దెప్పిపొడిచారు. బడ్జెట్‌లో అన్నివర్గాలకు మొండి చెయ్యి చూపారని ఆగ్రహించారు. మూడున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చి.. రేవంత్ చేసిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సచివాలయం, కాళేశ్వరం, చెక్ డ్యాంలు కట్టామని ప్రస్తావించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను వెనుక కూర్చోపెట్టుకుని భట్టి.. రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహించారు.
మేడారం టెండర్లలో స్కాం..
కాంగ్రెస్ హయాంలో స్కాంలు తప్ప.. స్కీంలు లేవని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మేడారం టెండర్లలో స్కాం జరిగిందని మంత్రి బిడ్డ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. గురుకుల పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేని సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారని ఎద్దేవా చేశారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వానివి కట్టుకథలని విమర్శించారు. అక్రమ సంపాదన దాచుకోవటానికే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. మూడుసార్లు రైతుబంధు ఎగొట్టినందుకు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాలన గాడి తప్పటం వలనే తలసరి ఆదాయం తగ్గిందని అన్నారు. పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి మాముళ్లు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రిని మూసేస్తామంటే.. భట్టి ఏమో యాదాద్రి తెలంగాణకు గర్వకారణమని అంటున్నారని అన్నారు. సింగరేణి గురించి కాంగ్రెస్‌కు మాట్లాడే హక్కు లేదన్నారు. సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విప్‌ల నియామకం..
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హరీశ్‌రావుతో ఆయిల్ పామ్ సాగు చేయించే బాధ్యత నాది: తుమ్మల నాగేశ్వరరావు
Read Latest Telangana News And AP News And International News And Telugu News