Home » Congress 6 Gurantees
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా అధికారులను కాంగ్రెస్ మంత్రులు వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ .
అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. జీఎస్టీ రేట్లు పెంచింది మోదీ ప్రభుత్వమేనని.. మళ్లీ ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా చర్చకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. 90 శాతం పనులు పూర్తి చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. రేవంత్, మల్లు భట్టి విక్రమార్క బాండు పేపర్‌పై సంతకాలు పెట్టి ఎన్నికల హామీలిచ్చారని.. కానీ ఎన్నికల హామీలపై ఇప్పడెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పథకాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి సీతక్క ఉద్ఘాటించారు.
తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాజగోపాల్ రెడ్డి 'ఎక్స్' వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు.
మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా నేతలు అందరూ కలిసి పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పని చేస్తేనే పదవులు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.
రుణమాఫీ చేయకుండా రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. దిగజారిన ఆర్థిక వ్యవస్థను తమకు అందించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. దళితుల సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రేవంత్ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కృషి చేస్తోందని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.