కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు: హరీశ్‌రావు
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:33 PM
కాంగ్రెస్, బీజేపీలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రెండున్నరేళ్లలో గజ్వేల్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఫైర్ అయ్యారు. శనివారం గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీశ్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో గజ్వేల్ రోడ్డుకు గుంతలు కూడా పూడ్చలేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే గజ్వేల్‌ని అభివృద్ధి చేశామని.. కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఆక్షేపించారు.
భూముల ధరలు పెరిగాయి..
నిన్న ఓ బీజేపీ ఎంపీ గజ్వేల్‌కు వచ్చి కేసీఆర్ హయాంలో రూ.50వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. మిషన్ కాకతీయ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గజ్వేల్‌లో భూముల ధరలు పెరిగాయని.. కానీ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక బంగారం ధర పెరిగి, భూముల ధరలు పడిపోయాయని ఎద్దేవా చేశారు. మొత్తం తెలంగాణను కేసీఆర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని.. రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు.
బీజేపీ ప్రభుత్వంలో పాల ధరలు, జీఎస్టీలు పెరిగాయి..
కేసీఆర్ హయాంలో కట్టిన బిల్డింగ్‌లకు రేవంత్‌రెడ్డి ఇప్పుడు రిబ్బన్ కటింగ్‌లు చేస్తున్నారని, బీఆర్ఎస్ ఇచ్చిన పథకాలనే ప్రారంభించారని హరీశ్‌రావు సెటైర్లు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం పాల ధరలు, జీఎస్టీలు పెంచింది తప్ప.. చేసిందేమీలేదని విమర్శించారు. ఎన్నికలు వస్తే పైసలు బాగా పంచుతారని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ప్రజా సమస్యలను తాను పరిష్కరించానని.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏమీ చేయలేదని చెప్పుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరెన్ని పైసలిచ్చినా, కాళ్లు మొక్కినా సరే.. బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటువేయాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి వార్నింగ్
వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..
Read Latest Telangana News And AP News And Telugu News