Share News

కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి వార్నింగ్

ABN , Publish Date - Feb 07 , 2026 | 10:22 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తమను విమర్శించే ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి వార్నింగ్
Kishan Reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి(CM Revanth Reddy) కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి(Kishan Reddy) స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తమను విమర్శించే ముందు సీఎం రేవంత్‌ ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. శనివారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌ తనను కల్వకుంట్ల కిషన్‌ రావు అని విమర్శించారని.. తానెలా కల్వకుంట్ల కిషన్‌ రావు అవుతాను? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం తనకు ఎందుకుంటుందని నిలదీశారు.


పిచ్చి ప్రేలాపనలు చేయొద్దు..

పనికిరాని, పసలేని ఆరోపణలు చేయడం రేవంత్‌ రెడ్డికి బాగా అలవాటైందని కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్‌ చెత్త విమర్శలకు తాను చాలాసార్లు కౌంటరిచ్చానని అన్నారు. మళ్లీ మళ్లీ ఆయన పిచ్చి ప్రేలాపనలు చేయొద్దని.. ఈ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కేంద్రంపై అనవసరంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నాడు ఇందిరాగాంధీని గెలిపిస్తే.. ఆ జిల్లా ప్రజలకు, తెలంగాణకు ఆమె ఏం చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.


ప్రచారానికి పవన్ కల్యాణ్.?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని కిషన్‌ రెడ్డి వివరించారు. తమ ఎంపీలకు మోదీ సమ ప్రాధాన్యం ఇస్తారని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెబుతామని తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వచ్చే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని కిషన్‌ రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేకే కుమారుడికి బెదిరింపులు.. అసలు విషయమిదే..

వందేభారత్‌ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 07 , 2026 | 11:04 AM