కేకే కుమారుడికి బెదిరింపులు.. అసలు విషయమిదే..
ABN , Publish Date - Feb 07 , 2026 | 09:04 AM
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు కుమారుడు వెంకట్‌పై కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. బంజారాహిల్స్ ప్రాంతంలోని ఓ ఇంటి విషయంలో బెదిరింపులకు దిగారని బాధితుడు వెంకట్ తన ఫిర్యాదులో తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు కుమారుడు వెంకట్‌పై(Kesava Rao son Venkat) కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. బంజారాహిల్స్ ప్రాంతంలోని ఓ ఇంటి క్రమబద్ధీకరణ వ్యవహారంలో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్(PIL) వేస్తామంటూ.. రూ.3 కోట్లు డిమాండ్ చేస్తూ కొందరు వ్యక్తులు బ్లాక్ మెయిల్ చేసినట్లు వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంటి క్రమబద్ధీకరణ కోసం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని ఓ ఇంటి క్రమబద్ధీకరణ అంశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు కోర్టులో పిల్ వేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. రూ.3 కోట్లు చెల్లిస్తే పిల్‌ను వెనక్కి తీసుకుంటామని ప్రతిపాదన చేసినట్లు వెంకట్ తెలిపారన్నారు. ఈ డిమాండ్‌కు అంగీకరించకపోవడంతో.. మరిన్ని కేసులు వేస్తామని బెదిరిస్తూ తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు.
ఇద్దరిపై కేసు నమోదు..
వెంకట్ ఫిర్యాదు మేరకు పోలీసులు సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీరారెడ్డి, అన్వేశ్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నాయంటే..
అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..
Read Latest Telangana News And AP News And Telugu News