Home » Hyderabad City Police
గంజాయి, డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న కేటుగాళ్లు మాత్రం మారడం లేదు. తాజాగా బిహార్‌కు చెందిన యువకుడు ఏకంగా కిస్మత్‌పురలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి సాగుచేస్తున్నాడు.
నూతన సంవత్సర వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకల అనంతరం ప్రజలు ఇంటికి చేరుకునే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పలు సూచనలు చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ పరిధిలో జింక మాంసం విక్రయాలు కలకలం రేపాయి. అత్తాపూర్‌లోని సులేమాన్ నగర్ ప్రాంతంలో జింక మాంసాన్ని అమ్ముతున్న మహ్మద్ ఇర్ఫానుద్దీన్ను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సైబర్ మోసాలపై పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్న ఎక్కడో ఒక చోట అమాయకులు సైబర్ కేటుగాళ్ల బారిన పడుతునే ఉన్నారు. తాజాగా ఓ బాధితురాలని సైబర్ మోసగాళ్లు మోసం చేసి భారీగా నగదు దోచుకున్నారు.
ప్రముఖ సినీనటి మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో సాయిబాబా దేవుడు కాదని తప్పుడు ప్రచారాలు, వ్యాప్తి చేసినందుకు మాధవీలతపై కేసు నమోదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ‘ఆరా’ పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్‌ను శుక్రవారం విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
నూతన సంవత్సరం సందర్భంగా భాగ్యనగరంలో పలు ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని మరోసారి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. నాలుగు కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతి భద్రతలు, ట్రాఫిక్ వంటి కీలక అంశాల్లో కమిషనరేట్లు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు సమావేశమయ్యారు.
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసుపై నాంపల్లి కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నిందితుడు రవిని మూడోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే మరో నాలుగు కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.