Share News

నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌ అగ్నిప్రమాదం.. పోలీసులకు ఫిర్యాదు..

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:48 PM

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ప్రాపర్టీ రూమ్‌లో నిన్న(శనివారం) అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎఫ్ఎస్ఎల్ ఇన్‌స్పెక్టర్ శ్రీవాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు..

నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌ అగ్నిప్రమాదం.. పోలీసులకు ఫిర్యాదు..
Nampally Forensic Lab Fire Accident

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ప్రాపర్టీ రూమ్‌లో నిన్న(శనివారం) అగ్ని ప్రమాదం (Nampally Forensic Lab Fire Accident) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎఫ్ఎస్ఎల్ ఇన్‌స్పెక్టర్ శ్రీవాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మొదట ప్రాపర్టీ రూమ్‌లో భారీగా నల్ల పొగతో కూడిన మంటలు వ్యాపించాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత మంటలు ఇతర గదులకి వ్యాపించాయని తెలిపారు. శనివారం ఉదయం 10.08 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందని ఫిర్యాదులో వెల్లడించారు.


శనివారం ఉదయం 10.30 గంటలకు ఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారని తెలిపారు. ల్యాబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగి శ్రీ సాయి కృష్ణ ప్రమాదంపై సమాచారం ఇచ్చారని అన్నారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్, కేసు వెరిఫికేషన్ ఛాంబర్, సర్వర్ రూమ్, అనాలసిస్ ఛాంబర్, HRD హాల్‌తో పాటు ఫర్నిచర్ పరికరాలు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయని ఫిర్యాదు చేశారు. జీరోఎఫ్ఐఆర్ ఫైర్ యాక్సిడెంట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫిర్యాదు ఆధారంగా పోలీస్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని ఎఫ్ఎస్ఎల్ ఇన్‌స్పెక్టర్ శ్రీవాస్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి వార్నింగ్

వందేభారత్‌ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 08 , 2026 | 02:59 PM