భాగ్యనగరంలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..
ABN , Publish Date - Feb 11 , 2026 | 01:53 PM
హైదరాబాద్ నగరంలో భారీగా గంజాయి రవాణా విక్రయానికి పాల్పడుతున్న నెట్‌వర్క్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో 70 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో భారీగా గంజాయి రవాణా విక్రయానికి పాల్పడుతున్న నెట్‌వర్క్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో 70 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన మనీల్ దలబెహరా, ఇస్మాయిల్ రైతా అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
ఒడిశాలో గంజాయి సాగు..
పోలీసుల వివరాల ప్రకారం.. మనీల్ దలబెహరా అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఒడిశాలో గంజాయి సాగు చేశాడు. ఆయన పండించిన గంజాయిని హైదరాబాద్‌లో విక్రయించాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో మేడ్చల్‌లో నివసిస్తున్న ఒడిశాకు చెందిన ఇస్మాయిల్ సహకారంతో నగరంలో మనీల్ దలబెహరా సరఫరా చేశాడు. ఇస్మాయిల్ ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తూ.. గంజాయి విక్రయం నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందని అన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి 70 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు
మక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా
Read Latest Telangana News And AP News And Telugu News