Home » Drugs Case
నడి సముద్రంలో 526 కేజీల డ్రగ్స్‌తో వెళ్తున్న ఇరానీ బోటును భారతీయ కోస్ట్ గార్డ్(ఐసీజీ) సిబ్బంది వెంటాడి పట్టుకున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్)తో కలిసి అరేబియా సముద్రంలో లక్షద్వీప్ సమీపంలో సెప్టెంబరు 25న చేపట్టిన ఈ ఆపరేషన్‌లో రూ.3 వేల కోట్ల విలువైన 526 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
భారత కోస్ట్ గార్డ్ అరేబియా సముద్రంలో సుమారు రూ.3వేల కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ పట్టుకున్నారు. ఆ పడవలో ఉన్న ఐదుగురు పాకిస్తానీ పౌరులను అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్, సైబర్ నేరాల కేసుల్లో బెయిల్‌పై విడుదలైన పలువురు నిందితులు తర్వాత కోర్టుకు హాజరుకాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్లు ప్రత్యేక తనిఖీల్లో వెల్లడైంది. డ్రగ్స్ కేసుల్లో 3,228 మంది, సైబర్ కేసుల్లో 115 మంది ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి వారెంట్‌ల అమలుపై దృష్టి సారించారు.
హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు శనివారం భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై తనిఖీలు నిర్వహించారు.
ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానం గాల్లో తీవ్ర కుదుపులుకు గురైన ఘటనలో, విమాన ప్రధాన పైలట్ గంజాయి ఉపయోగించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. దీంతో ఎయిర్ ఇండియా సంస్థ తన 'జీరో టాలరెన్స్' విధానంలో భాగంగా సదరు పైలట్‌ను ఉద్యోగం నుంచి తక్షణమే తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది, పటిష్టమైన చర్యలు చేపట్టే లక్ష్యంతో ఏపీ ఈగల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
నషా ముక్త్ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వ్యాఖ్యానించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, విద్యా క్రీడా రంగాల్లో రాణించాలని సూచించారు.
డ్రగ్స్ రవాణా కేసులో మాజీ ఎయిర్ హోస్టెస్ అరెస్టు కావడం ప్రకంపనలు రేపుతోంది. వడోదర నుంచి ముంబైకి కారులో మత్తుపదార్థాలను తరలిస్తూ ఆమె పట్టుబడింది. రూ.30 లక్షల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్‌ను సరఫరా చేస్తూ అడ్డంగా బుక్కైంది.
బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా హైదరాబాద్‌లో పట్టుబడింది. టాస్క్‌ఫోర్స్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురిని అరెస్ట్ చేసి, 50 ఇంజెక్షన్ వాయిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నవా షెవా పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. DRI అధికారులు చేపట్టిన తనిఖీల్లో 56 కిలోల మెథాంఫేటమిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొక్కజొన్న సంచుల్లో దాచి సౌదీ అరేబియాకు తరలించేందుకు ప్రయత్నించగా.. 351 సంచులను తనిఖీ చేసి డ్రగ్స్‌ను గుర్తించారు. వివరాల్లోకి వెళితే..