Share News

Navadeep Drugs Case: యంగ్ హీరో నవదీప్‌నకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

ABN , Publish Date - Jan 09 , 2026 | 02:34 PM

డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌నకు భారీ ఊరట లభించింది. అతడిపై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది.

Navadeep Drugs Case: యంగ్ హీరో నవదీప్‌నకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
Navadeep

ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్‌నకు హైకోర్టులో భారీ ఉపశమనం కలిగింది(Navadeep Drugs Case). అతడిపై నమోదైన డ్రగ్స్ కేసును తెలంగాణా న్యాయస్థానం కొట్టివేసింది. నవదీప్ వద్ద డ్రగ్స్ ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదనే ఆయన తరఫు న్యాయవాది వెంకట సిద్ధార్థ్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ఈ కేసును కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. దీంతో ఈ యంగ్ హీరోకు పూర్తిస్థాయిలో ఉపశమనం లభించినట్టైంది.


కొద్ది నెలల క్రితం.. హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో(Hyderabad Drugs Case) హీరో నవదీప్ పేరు వినిపించడంతో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అందులో భాగంగా.. గుడిమల్కాపూర్‌లో నమోదైన కేసులో ఎఫ్ఐఆర్‌లో అతడి పేరు నమోదైంది. ఈ ఆరోపణలపై నవదీప్ ఘాటుగా స్పందించారు. తనకు, డ్రగ్స్‌కు ఎలాంటి సంబంధం లేదని అతను వాపోయాడు. ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్ చేయొద్దంటూ అతను గతంలో తెలంగాణా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ కేసుపై మరోసారి విచారణ చేపట్టింది న్యాయస్థానం. నవదీప్‌ పేరును కేవలం ఎఫ్ఐఆర్‌లోనే చేర్చారని.. అతను డ్రగ్స్ తీసుకున్నట్టు ఆధారాలేవీ లేవని స్పష్టం కావడంతో ఈ కేసును కొట్టివేసింది.


ఇవీ చదవండి:

కేటీఆర్‌పై గజ్జెల కాంతం షాకింగ్ కామెంట్స్

సంక్రాంతికి ఊరెళ్తే.. సమాచారమివ్వండి

Updated Date - Jan 09 , 2026 | 02:57 PM