Gajjela Kantham: కేటీఆర్‌పై గజ్జెల కాంతం షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jan 09 , 2026 | 01:03 PM
కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ హీరోయిన్‌కు కేటీఆర్ వంద కోట్లు ఇచ్చారని ఆరోపించారు. కేటీఆర్‌కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
హైదరాబాద్, జనవరి 9: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (Former Minister KTR) పీసీసీ తెలంగాణ జనరల్ సెక్రెటరీ గజ్జెల కాంతం (Congress Leader Gajjela Kantham) సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దుబాయ్‌లో తన బినామీని చంపితే ఆధారాలు పోతాయని కేటీఆర్ భ్రమపడ్డారని గజ్జెల కాంతం ఆరోపించారు. నాలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ మకాం వేసేవారని తెలిపారు. 2022 జనవరి 24న ఒక హీరోయిన్‌కు కేటీఆర్ రూ.100 కోట్లు ఇచ్చారని.. ఒక కాంట్రాక్టర్, జ్యువెలరీ షాప్ యజమాని అకౌంట్ నుంచి ఆ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు.
హీరోయిన్‌ను బెదిరించి మరీ..
ముంబైలోని తాజ్ కృష్ణా హోటల్ 328వ గదికి ఒక హీరోయిన్‌ను పిలిపించి, రూ.35 కోట్ల 75 లక్షలతో విల్లా కొనిచ్చారని, ఆడి కారు కూడా బహుమతిగా ఇచ్చారని గజ్జెల ఆరోపించారు. 2022 మార్చి 3న ఢిల్లీలోని లలిత్ హోటల్ 770వ గదికి.. మైసూర్‌లో షూటింగ్ చేస్తున్న హీరోయిన్‌ను బెదిరించి పిలిపించుకున్నారని, రూ.50 కోట్లు ఇస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబం అమెరికాలో రూ.40 వేల కోట్లు, దుబాయ్‌లో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందన్నారు. దాదాపు 30 వేల ఎకరాల భూములు దోచుకున్నారని ఆరోపించారు. కేటీఆర్‌కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇవన్నీ అబద్ధాలని తన కొడుకుపై ప్రమాణం చేయగలరా అని గజ్జెల కాంతం నిలదీశారు.
రాహుల్ కాలి గోటికి సరిపోరు..
కేసీఆర్‌కు ఎన్టీఆర్, చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారని.. దొంగ పాస్‌పోర్టులు సృష్టించిన చరిత్ర కేసీఆర్‌దేనని గజ్జెల కాంతం విరుచుకుపడ్డారు. ఎన్నికల కోసం జగన్‌కు రూ. 200 కోట్లు.. మహారాష్ట్ర, బీహార్, పంజాబ్, ఢిల్లీకి కోట్లాది రూపాయలను కేసీఆర్ పంపారన్నారు. అఖిలేష్ యాదవ్, కుమారస్వామికి కేటీఆర్ డబ్బులు పంపారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా, రాహుల్‌పై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం వల్లే కేటీఆర్ మంత్రి అయ్యారని, రాహుల్ కాలి గోటికి కూడా కేటీఆర్ సరిపోరని వ్యాఖ్యానించారు.
కేటీఆర్‌కు జ్ఞానం లేదు..
రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, కేటీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందని గజ్జెల కాంతం ప్రశ్నించారు. చట్టాలు, రాజ్యాంగంపై కేటీఆర్‌కు గౌరవం, జ్ఞానం లేదని, చరిత్ర తెలియదని విమర్శించారు. రాహుల్ గాంధీ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదని.. కేటీఆర్ లాగా రాహుల్, రేవంత్‌లు దోచుకోలేదని గజ్జెల కాంతం పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
రాయచోటి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నారా లోకేష్
అలాస్కా ట్రిప్.. మైనస్ 40 డిగ్రీల చలి.. తెలుగు విద్యార్థి అదృశ్యం
Read Latest Telangana News And Telugu News