Home » Congress
CWC సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుతో కోట్లాది పేదలకు ఉపాధి కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వపరంగా సీఎంలు, ఆశాఖ మంత్రులు చర్చించాల్సిన అంశాలపై తానేమీ మాట్లాడనని జగ్గారెడ్డి తెలిపారు. గతంలో జగన్, కేసీఆర్లు వీటిపై ఎప్పుడైనా చర్చలు చేశారా అని ప్రశ్నించారు.
ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ..
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎక్కడుంటే దానం అక్కడకు మకాం మార్చుతారు.. అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీ ఒడిలో కూర్చున్నారని చింతల విమర్శించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన బహిరంగ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు తీరుపై విమర్శలు చేస్తూ సాగింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ' రేవంత్.. ఎవరితో ఫుట్బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు. నేను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటాను. రేవంత్ ఇంట్లోని మహిళలను, పిల్లలను, మనుమడి గురించి నేను మాట్లాడను. రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబ సభ్యుల విషయంలో నేను చిల్లర రాజకీయాలు చేయను' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు, ట్రెండ్స్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో.. అధికార కాంగ్రెస్ పార్టీ అనుకున్నదొకటి, అయ్యిందొకటి అన్నట్లుగా జరిగిందని భావిస్తుప్పారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే శివార్లలో బీఆర్ఎస్ పార్టీ గట్టిపోటీ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతల్లో కలవరం కలిగిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై అక్రమంగా కేసులు పెట్టారని, వీటిని కొట్టివేయాలని ఆ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కో కన్వీనర్ కాశీంవలి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జోరు చూపించింది. మూడువిడతల్లోనూ సత్తా చాటి విపక్షాలపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది...