‘నన్ను జైలుకు పంపాలనుకుంటే పంపండి’.. బాల్క సుమన్ సవాల్
ABN , Publish Date - Feb 18 , 2026 | 04:19 PM
మంత్రి వివేక్‌పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఖ్యాబలం లేకున్నా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోందని మండిపడ్డారు.
మంచిర్యాల, ఫిబ్రవరి 18: మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి వివేక్ వెంకటస్వామిపై (Minister Vivek Venkataswamy) బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Former MLA Balka Suman) తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. క్యాతనపల్లిలో బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉందన్నారు. తమ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని ఆరోపించారు. సంఖ్యాబలం లేకున్నా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోందని మండిపడ్డారు. పోలీసులు అడుగడుగునా తమకు అడ్డుతగిలారని.. లాఠీఛార్జ్ చేయడంతో పాటు రాళ్లు రువ్వారని తెలిపారు.
తమ కాన్వాయ్‌పైనే దాడి జరిగిందని.. మంత్రి కాన్వాయ్‌పై కాదని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ‘నన్ను జైలుకు పంపాలనుకుంటే పంపండి’ అంటూ సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యాన్ని మంత్రి వివేక్ ఖూనీ చేశారని ఆరోపించారు. మంత్రి వివేక్ రౌడీయిజం, దౌర్జన్యం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి...
దారుణం.. భర్తను చున్నీతో ఉరేసి చంపిన భార్య
ఘోరం.. మొదటి భర్తను నేనే అంటూ మహిళను..
Read Latest Telangana News And Telugu News