Share News

దారుణం.. భర్తను చున్నీతో ఉరేసి చంపిన భార్య

ABN , Publish Date - Feb 18 , 2026 | 02:43 PM

హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన భర్తను భార్య చున్నీతో గొంతు బిగించి చంపేసింది.

దారుణం.. భర్తను చున్నీతో ఉరేసి చంపిన భార్య
Hyderabad News

హైదరాబాద్, ఫిబ్రవరి 18: పాతబస్తీలో (Old City) దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. పాతబస్తీ భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు మహమ్మద్ ఇషాక్‌గా పోలీసులు గుర్తించారు. అతడు ఆటోనడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇషాక్ మద్యానికి బానిసవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే గత రాత్రి కూడా ఇరువురి మధ్య వాగ్వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది.


దీంతో, మద్యం సేవించి రోజూ గొడవపడుతున్న భర్తను నిద్రలో ఉండగానే చున్నీతో గొంతు బిగించి హత్య చేసింది భార్య నూర్జహాన్ బేగం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.


ఇవి కూడా చదవండి...

నడిరోడ్డుపై గొంతుకోసుకున్న యువకుడు.. భయాందోళనలో ప్రజలు

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై స్టే ఎత్తివేత.. వారిదే నిర్ణయమన్న హైకోర్టు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 02:59 PM