Home » Old City
హైదరాబాద్ పాతబస్తీలో గల బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ జూ పార్క్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ స్క్రాప్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం పాత బస్తీలో నివసిస్తున్న బెంగాలీ కుటుంబాలతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్ ఫలక్‌నుమా ఫరూఖ్‌నగర్‌లో బస్‌డిపో సమీపంలోని సోఫాల తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి నుంచి మంటలు పక్కనే ఉన్న ఫర్నిచర్ షాపు, ఇతర దుకాణాలకు వ్యాపించాయి.
పాతబస్తీ చార్మినార్ సమీపంలోని షహ్రాన్ మార్కెట్‌లోని బుర్ఖా దుకాణం మూడవ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. మినీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన భర్తను భార్య చున్నీతో గొంతు బిగించి చంపేసింది.
హైదరాబాద్‌లోని పాతబస్తీలో నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తూ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. చార్మినార్ జోన్ పరిధిలో రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచేందుకు 300 మందికి పైగా పోలీసులు ఈ ఆకస్మిక సోదాలు చేపట్టారు.
హైదరాబాద్ పాతబస్తీలో రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా కాలాపత్తర్ ప్రాంతంలో రౌడీషీటర్ అసద్, అతని గ్యాంగ్ చేసిన దాడి స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.
హైదరాబాద్ పాతబస్తీలో తుపాకీ కలకలం రేపింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా నాటు తుపాకీ లభించింది.
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హత్య చేశారు.
గోమతి ఎలక్ట్రానిక్స్‌లో ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారు ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.