పాతబస్తీలో పోలీసుల మెరుపు దాడులు.. 300 మందితో రౌడీ షీటర్ల ఇళ్లలో సోదాలు
ABN , Publish Date - Feb 14 , 2026 | 10:06 PM
హైదరాబాద్‌లోని పాతబస్తీలో నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తూ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. చార్మినార్ జోన్ పరిధిలో రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచేందుకు 300 మందికి పైగా పోలీసులు ఈ ఆకస్మిక సోదాలు చేపట్టారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 14: భాగ్యనగరంలో శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా చార్మినార్ జోన్ పోలీసులు ఈ (శనివారం) రాత్రి భారీ 'కార్డన్ అండ్ సెర్చ్' ఆపరేషన్ నిర్వహించారు. డీసీపీ కిరణ్ ఖరే స్వయంగా పర్యవేక్షించిన ఈ సోదాల్లో రౌడీ షీటర్ల ఇళ్లను జల్లెడ పట్టారు.
ఆపరేషన్ 'కవచ్' ముఖ్యాంశాలు.. భారీ బలగాల మోహరింపు:
ఈ ఆకస్మిక తనిఖీల్లో సుమారు 300 మందికి పైగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఏసీపీ పర్యవేక్షణలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
90 మందిపై నిఘా: చార్మినార్ జోన్ వ్యాప్తంగా ఉన్న దాదాపు 90 మందికి పైగా రౌడీ షీటర్ల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో మారణాయుధాలు, గంజాయి, ఇతర నిషిద్ధ పదార్థాల కోసం పోలీసులు ప్రతి మూలనూ గాలించారు.
రౌడీయిజంపై జీరో టోలరెన్స్
నేర ప్రవృత్తి కలిగిన వారు తమ పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని డీసీపీ కిరణ్ ఖరే హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే రౌడీ షీటర్లకు రూ. 50,000 నుండి రూ. 1,00,000 వరకు జరిమానాతో పాటు కఠిన కారాగార శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక రోజుతో ముగిసే ప్రక్రియ కాదని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఆయన ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం..
ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్.. ఏం జరిగిందంటే.?