ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్ స్లాబ్.. ఏం జరిగిందంటే.?
ABN , Publish Date - Feb 14 , 2026 | 01:43 PM
ముంబైలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌లోని కొంత భాగం శనివారం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..
ముంబై, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ముంబైలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌లోని (Mumbai Metro Pillar Collapse) కొంత భాగం ఇవాళ (శనివారం) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగ్రాతులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ములుంద్ వెస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. నిర్మాణంలోని పిల్లర్‌లో కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోవడంతో.. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు శిథిలాల కింద చిక్కుకున్నారు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పిల్లర్ శిథిలాలు కూలిపోవడంతో అక్కడ పార్క్ చేసిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. రక్షణ చర్యలు కొనసాగుతుండగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
Read Latest Telangana News And AP News And Telugu News