Home » Police Rides
భారత కోస్ట్ గార్డ్ అరేబియా సముద్రంలో సుమారు రూ.3వేల కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ పట్టుకున్నారు. ఆ పడవలో ఉన్న ఐదుగురు పాకిస్తానీ పౌరులను అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ రాత్రివేళ విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది.
సినిమాల్లో ముసుగు వేసుకుని వచ్చి నేరస్థులను నడిరోడ్డుపై శిక్షించే 'బ్యాట్‌మ్యాన్' పాత్రను మనం చూసే ఉంటాం. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఘటనలే నిజజీవితంలో జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అతడిని నెటిజన్లు 'మెక్సికన్ బ్యాట్‌మ్యాన్'గా పిలుచుకుంటున్నారు.
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.
దేశంలోని పలు కీలక ప్రాంతాలలో భారీ ఉగ్ర దాడులకు వ్యూహం పన్నిన తొమ్మిది మంది ఉగ్రవాదుల అరెస్ట్ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్ర మూక వెనుక పాకిస్తాన్ ఐఎస్‌ఐతో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కీలక పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ పోలీసులు చేపట్టిన 'ఆక్టోపస్' ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి, సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న 32 మంది బ్యాంకు అధికారులతో పాటు మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లోని పాతబస్తీలో నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తూ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. చార్మినార్ జోన్ పరిధిలో రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచేందుకు 300 మందికి పైగా పోలీసులు ఈ ఆకస్మిక సోదాలు చేపట్టారు.
ఖమ్మం జిల్లాలో ఐదు కోట్ల రూపాయల విలువైన గంజాయిని తగులబెట్టారు. 47 కేసులలో స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో దగ్ధం చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ ప్రాంతంలో పోలీసులు ఇవాళ విస్తృత దాడులు చేశారు. మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చినట్టు ఆరోపణల నేపథ్యంలో ప్రజా సంఘాల నాయకుల ఇళ్లలో సోదాలు జరిపారు.
ఒకే హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయవచ్చా.. ఎలాంటి సందర్భంలో వారిని అదుపులోకి తీసుకోవచ్చు.. వాటికి సంబంధించిన నియమ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓసారి తెలుసుకుందాం.